Begin typing your search above and press return to search.

శ్రద్ధ కోసం ఇద్దరూ కొట్టుకున్నారట

By:  Tupaki Desk   |   5 April 2017 5:24 AM GMT
శ్రద్ధ కోసం ఇద్దరూ కొట్టుకున్నారట
X
ఆదిత్య రాయ్ కపూర్.. ఫర్హాన్ అక్తర్ లు ఇద్దరూ తెగ తిట్టేసుకుని.. దాదాపు కొట్టుకునే వరకూ వెళ్లారన్న న్యూస్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా జరిగిన ఓ పార్టీలో వీరిద్దరి మధ్య మాటలతో మొదలైన యుద్ధం.. చేతల వరకూ వచ్చేయగా.. మధ్యలో శ్రద్ధా కపూర్ వచ్చి సర్ది చెప్పేందుకు ప్రయత్నించిందట. అయితే.. అసలీ గొడవకు కారణమే శ్రద్ధా కపూర్ కావడమే అసలైన విషయం.

తాజాగా మహేష్ భట్ 30 ఇయర్స్ సెలబ్రేషన్స్ ముంబైలో జరుగుతున్నాయి. ఆయన ఇంట్లోనే జరుగుతున్న ఈ వేడుకలకు బాలీవుడ్ నుంచి చాలా మంది అతిథులే వచ్చారు. ఈ సంబరాల్లో ఆదిత్య రాయ్ కపూర్- శ్రద్ధా కపూర్ బాగా క్లోజ్ గా మూవ్ అయ్యారట. 2013లో వీరిద్దరూ ఆషికి2లో నటించినప్పుడు వీరి మధ్య ఏదో ఎఫైర్ ఉందంటూ హంగామా నడిచింది. అయితే.. ఆదిత్య-శ్రద్ధలు ఇంత క్లోజ్ గా మూవ్ అవడాన్ని జీర్ణించుకోలేక పోయాడట.. శ్రద్ధ లేటెస్ట్ లవర్ ఫర్హాన్ అక్తర్.

ఈ విషయంలోనే ఆదిత్యతో గొడవపడ్డం.. ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో.. డ్యామేజ్ కంట్రోల్ కోసం రంగంలోకి దిగిందిట శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ ఇంటికి వెళ్లి మరీ.. సమస్యను పరిష్కరించేస్తోందని తెలుస్తోంది. ఫర్హాన్ అక్తర్ ఇంటికి.. శ్రద్ధా కపూర్.. ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరూ వెళ్లి మరీ సుదీర్ఘమైన వివరణ ఇవ్వడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/