Begin typing your search above and press return to search.
అమ్మాయిల స్కర్ట్స్ చూసేందుకు వెళ్లాను
By: Tupaki Desk | 19 April 2017 7:53 AM GMTబాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ప్రస్తుతం బోలెడంత క్రేజ్ సంపాదించేసుకున్నాడు. వీజేగా కెరీర్ స్టార్ట్ చేసి.. చిన్న చిన్న రోల్స్ తో సినిమాల్లో అరంగేట్రం చేసి.. ఆషికి2 తో హీరోగా మారిన ఆదిత్య రాయ్.. రీసెంట్ గా ఓకే జాను చిత్రంతో అలరించాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను చిన్నపుడు ఎంతటి అల్లరి చిల్లరిగా తిరిగేవాడో చెప్పాడు ఆదిత్య రాయ్ కపూర్. తన అమ్మమ్మ.. తాతయ్యలు లాటిన్ అమెరికా డ్యాన్స్ ను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారట. తల్లి సలోమీ రాయ్ కపూర్ కూడా డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం చూపించేవారట. వెస్టర్న్.. ఇండియన్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ లే కాదు.. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ నేర్పించేవారట ఆమె. అయితే.. ఆ డ్యాన్స్ క్లాసులకు తానూ అటెండ్ అయ్యే వాడినని చెప్పిన ఆదిత్య రాయ్ కపూర్.. డ్యాన్స్ నేర్చుకునేందుకు కాకుండా.. అమ్మాయిల స్కర్ట్స్ చూసేందుకు వెళ్లేవాడినని చెప్పాడు.
రీసెంట్ ఓ ఈవెంట్ లో పాల్గొన్నపుడు.. ఓ లేడీ ఇతని దగ్గరకు వచ్చి ఓ విషయం చెప్పిందట. పాతికేళ్ల క్రితం ఆమెను తెగ విసిగించేసి.. ఓసారి వెనకవైపు గిల్లేసి పారిపోయావ్ అని గుర్తు చేసిందట ఆ మహిళ. అప్పుడు ఆదిత్య రాయ్ కపూర్ వయసు 5 ఏళ్లు మాత్రమే అనేది పాయింట్ అసలు సిసలైన కంక్లూజన్. ఐదేళ్లకే ఆ స్థాయి అల్లరంటే.. ఇప్పుడు ఏ రేంజ్ లో చేస్తాడో కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/