Begin typing your search above and press return to search.
ఓటు హక్కుపై గూఢచారి కామెంట్ వేడెక్కించిందిగా
By: Tupaki Desk | 20 Nov 2020 12:10 PM GMTకథ కంటెంట్ ప్రతిభను నమ్ముకుని ఎదిగే హీరోలకు టాలీవుడ్ లో కొదవేమీ లేదు. సినీనేపథ్యం లేకపోయినా వీళ్లను ఆదుకునేది ఈ క్వాలిటీనే. ఆ కోవకే చెందుతాడు అడవి శేష్. గూఢచారి... ఎవరు... క్షణం ఇవన్నీ అతడి ఫేట్ ని మార్చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు.
ప్రస్తుతం మేజర్ అనే సినిమాలో నటిస్తున్న శేష్.. పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు గూఢచారి 2 సన్నాహాలు చేస్తున్నాడు. మేజర్ చిత్రాన్ని గూఢచారి ఫేం శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక సినిమాల గురించి కాకుండా ఊరు పర్యావరణం ఎన్నికలు అంటూ శేష్ చేసిన కామెంట్ వేడెక్కిస్తోంది. ``ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది. మణికొండలాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్ వాటర్ ని ఎక్కువగా తోడేస్తున్నాం.. అంతేకాదు.. భారీ నిర్మాణాలు సిమెంటు రోడ్లతో ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి`` అని అన్నారు.
ఓటు హక్కు విలువ గురించి శేష్ వేడెక్కించే కామెంట్ చేశారు. ఓటుహక్కు అన్నది బ్రహ్మాస్త్రం. ఓటు ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా దొరక్కపోయినా నాయకులకు మనం ఇచ్చే విలువ ఏంటి అంటే ఓటు వేయడమే అంటూ హాట్ కామెంట్ చేశారు శేష్. గ్రేటర్ ఎన్నికల వేళ అతడి కామెంట్లు యూత్ లో వైరల్ గా మారాయి. యువహీరో ప్రాపంచిక జ్ఞానానికి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మంచి మాట చెప్పాడంటూ పొగిడేస్తున్నారు.