Begin typing your search above and press return to search.
#శేష్ ట్వీట్.. 'కర్మ' సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ వరకూ..
By: Tupaki Desk | 5 Jun 2023 12:00 PM GMTఓ వైపు హీరోగా మరోవైపు దర్శకరచయితగా ఆల్ రౌండర్ ప్రతిభతో రాణిస్తున్న నటుల్లో అడివి శేష్ ఒకరు.. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల మేజర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన స్వీయ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం 'కర్మ' గురించి శేష్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వివరాలను పంచుకున్నారు.
హాలీవుడ్ చిత్రం 'మూన్ లైట్'కి పని చేసి ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమాటోగ్రాఫర్ జేమ్స్ లాక్టన్ తో తాను ఒక తెలుగు చిత్రానికి పనిచేశానని పేర్కొంటూ ట్విట్టర్ హ్యాండిల్ ను రీట్వీట్ చేశాడు. ''జేమ్స్ అద్భుతమైన సినిమాటోగ్రాఫర్. నా మొదటి సినిమా 'కర్మ'కి ఆయనతో కలిసి పనిచేయడం గర్వంగా ఫీలవుతాను.
మేము షూటింగ్ ప్రారంభించినప్పుడు.. రెడ్ కెమెరాతో (రెడ్ వన్ సిస్టమ్) షూట్ చేసిన తొలి తెలుగు సినిమా ఇదే. అయితే కమల్ హాసన్ నటించిన 'ఈనాడు' అంతకుముందు విడుదలైంది. జేమ్స్ కి రెండు లైట్లు ఉన్నాయి. అంత పెద్ద కెమెరాని వాళ్లతో హ్యాండిల్ చేసేవాడు. అతనికి ఒక సహాయకుడు మాత్రమే ఉన్నాడు. లైట్లు- కరెంటు పనులన్నీ ఇద్దరూ చూసుకునేవారు.
జేమ్స్ ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 10 సినిమాటోగ్రాఫర్ ల జాబితాలో ఉన్నాడు. పూర్తిగా అమెరికాలో చిత్రీకరించిన తొలి తెలుగు సినిమాగా 'కర్మ'. ఇది 15 నవంబర్ 2010న తెరపైకి వచ్చింది'' అని తెలిపాడు.
ది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్-ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్-ది వయలెంట్ కైండ్-కాలిఫోర్నియా సోలో-క్యాంప్ ఎక్స్-రే-ఎనీథింగ్ వంటి హాలీవుడ్ చిత్రాలకు జేమ్స్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు.
ఇక శేష్ విషయానికి వస్తే.. క్షణం-గూఢచారి-ఎవరు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించిన ఆయన గతేడాది మేజర్-హిట్: సెకండ్ కేస్ చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం 'గూఢచారి 2' పనిలో నిమగ్నమై ఉన్నాడు.