Begin typing your search above and press return to search.

మళ్లీ జట్టు కట్టిన అడవి సోదరులు

By:  Tupaki Desk   |   3 Oct 2017 4:11 AM
మళ్లీ జట్టు కట్టిన అడవి సోదరులు
X
విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నా హీరోగానూ మెప్పించగలని క్షణం సినిమాతో నిరూపించుకున్నాడు నటుడు అడవి శేష్. ఈ సినిమా తర్వాత అడవి శేష్ కు మంచి అవకాశాలే వచ్చాయి. తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన అమీతుమీలోనూ హీరోగా నటించాడు. ఇందులో ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ లోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అడవి శేష్ సోదరుడు అడవి సాయికిరణ్ సక్సెస్ ఫుల్ గా డైరెక్టర్ గా టాలీవుడ్ లో మంచిపేరే సంపాదించుకున్నాడు. ఫస్ట్ సినిమా వినాయకుడు సినిమాతో డైరెక్టర్ గా హిట్ కొట్టాడు. ఆ తరవాత విలేజ్ లో వినాయకుడు - కేరింత సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇప్పుడీ సోదరులిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సాయి కిరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను గవర పార్థసారథి నిర్మిస్తున్నారు. ఈయన అప్పుడెప్పుడో రాజేంద్ర ప్రసాద్ తో మిస్టర్ పెళ్లాం సినిమా తీశారు. చాలారోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన అన్నదమ్ముల సినిమాతో తిరిగి సినిమా రంగానికి వస్తున్నారు.

ఇంతకుముందు అడవి శేష్ - సాయికిరణ్ కలిసి ఓ సినిమాకు పనిచేశారు. కిస్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ చేసింది అడవి శేష్. సాయికిరణ్ దీనికి నిర్మాతగా వ్యవహరించారు. కాకుంటే ఈ సినిమా ఎప్పుడొచ్చింది.. ఎప్పుడెళ్లిందీ చాలామందికి తెలియదు. ఆ తర్వాత హీరోగా శేష్ - డైరెక్టర్ గా సాయికిరణ్ తామేంటో ప్రూవ్ చేసుకుని మళ్లీ జట్టు కడుతున్నారు.