Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: హంతకుడు ఎవరు?

By:  Tupaki Desk   |   19 July 2019 1:11 PM GMT
టీజర్ టాక్: హంతకుడు ఎవరు?
X
థ్రిల్లర్ బేస్డ్ కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న అడవి శేష్ కొత్త సినిమా ఎవరు. రెజీనా కసెండ్రా కీలక పాత్ర పోషించిన ఈ మూవీ టీజర్ ఇందాక విడుదల చేశారు. అనుకోని పరిస్థితుల్లో ఓ అమ్మాయి(రెజీనా)ప్రేమించిన ప్రియుడినే(శరత్ చంద్ర)హత్య చేసిన కేసులో ఇరుక్కుంటుంది. ఆధారాలు చాలా బలంగా ఉండటంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ అందులో చాలా క్లిష్టమైన విషయాలు ఉండటంతో ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ విక్రమ్(అడవి శేష్)ని ఆపోయింట్ చేస్తారు.

దీన్ని సవాల్ గా తీసుకున్న విక్రమ్ ఆ అమ్మాయిని కలిసి విచారణ మొదలుపెడతాడు. అందులో ఎన్నో చిక్కుముళ్లు. తను నిర్దోషినని ఆ యువతి వాదన. మరి విక్రమ్ పద్మవ్యూహం లాంటి ఈ కేసుని ఎలా పరిష్కరించాడు ఇంతకీ ఆ అబ్బాయిని హత్య చేసి ఆ అమ్మాయి మీదకు తోసింది ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం టీజర్లో కాదు థియేటర్లో వెతకాలి

నిమిషంలోపే ఉన్నా ఆసక్తి రేపడంలో ఎవరు టీమ్ సక్సెస్ అయ్యింది. అడవి శేష్ పోలీస్ ఆఫీసర్ గా కొత్తగా ఉన్నాడు. దారుణమైన పరిస్థితుల్లో హత్యా నేరం మోపబడిన అమాయకురాలిగా రెజీనా నటన ఛాలెంజింగ్ గా కనిపిస్తోంది. నవీన్ చంద్ర - మురళి శర్మ -పవిత్ర లోకేష్ తదితర ఆర్టిస్టులను ఫాస్ట్ షాట్స్ లో అలా చూపించి వదిలేశారు. వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం శ్రీచరణ్ పాకాల సంగీతం ఇలాంటి ఇంటెన్స్ సబ్జెక్ట్స్ డిమాండ్ చేసే ఔట్ ఫుట్ అందించాయి.

హాలీవుడ్ మూవీ ఇన్విజిబుల్ గెస్ట్ ఛాయలు కనిపిస్తున్న ఎవరుకి వెంకట్ రాంజీ దర్శకత్వ ప్రతిభ మంచి టెక్నీకల్ వాల్యూస్ తో కనిపిస్తోంది. పివిపి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. క్రైం థ్రిల్లర్స్ లో డిఫరెంట్ గా కాస్త కొత్తగా అనిపిస్తున్న ఎవరు ఆ జానర్ ని ఇష్టపడే వాళ్లకు కావాల్సిన అంశాలన్నీ కూడగట్టుకున్న ఇంప్రెషన్ అయితే ట్రైలర్ ద్వారా కలిగించింది. ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న ఎవరు అడవి శేష్ కు గూఢచారి లాంటి సక్సెస్ ఫుల్ మూవీ వస్తున్న చిత్రం కావడంతో ఆరకంగా కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి