Begin typing your search above and press return to search.
అంత దూకుడెందుకు గూఢచారి
By: Tupaki Desk | 7 Jun 2019 7:19 AM GMTక్షణంతో మంచి పేరు తెచ్చుకుని గూఢచారితో సర్ప్రైజ్ హిట్ కొట్టిన అడవి శేష్ తన మార్కెట్ ని కాస్త ఎక్కువ అంచనా వేసుకుంటున్నాడనే టాక్ ఇప్పుడు గుప్పుమంటోంది. తన కొత్త సినిమా ఎవరు టైటిల్ లుక్ ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు దూరంగా కొత్తగా ట్రై చేస్తాడని పేరుంది కాబట్టి ప్రేక్షకుల్లోనూ ట్రేడ్ లోనూ ఓ మాదిరి ఆసక్తి ఉంది. అయితే దీన్నే ఇంకోలా అర్థం చేసుకున్న శేష్ ఎవరుకి ఎక్కువ బిజినెస్ ఆశిస్తున్నాడట.
శేష్ కున్న మార్కెట్ ఇమేజ్ ని బట్టి కాకుండా చాలా ఎక్కువగా కోట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికిప్పుడు డీల్ క్లోజ్ చేసేందుకు మొగ్గు చూపకపోవడంతో ఇంకొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు వినికిడి. గూఢచారి మంచి విజయం సాధించిన మాట వాస్తవమే కానీ దానికి చాలా కారణాలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్ రీజనబుల్ రేట్స్ కి బిజినెస్ చేయడం శశికిరణ్ తిక్కా దర్శకత్వ ప్రతిభతో పాటుగా శేష్ ప్రెజెన్స్ హెల్ప్ అయ్యాయి. అంతే తప్ప ఏ ఒక్క ఫ్యాక్టర్ తోనో ఆడిన సినిమా కాదది
దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎవరుకి చాలా ఎక్కువ ఆశించడం అత్యాశని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. నిర్మాత పివిపినే అయినప్పటికీ ఈ వ్యవహారాలన్నీ శేష్ చూసుకుంటున్నాడట. ఓవర్ కాన్ఫిడెన్స్ తో గూఢచారిని చూపించి స్టార్ హీరోలా ఫీలైపోయి అంత డిమాండ్ చేయడం సబబు కాదని ఇంకో నాలుగైదు సినిమాలు ఇదే స్థాయిలో ఆడితే అప్పుడు డిమాండ్ చేయొచ్చు కానీ ఇప్పుడు మాత్రం తొందరపడుతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ అఫీషియల్ గా మీడియా కంట్లో పడేవి కాదు కాబట్టి ఎక్కువ హై లైట్ అవ్వడం లేదు కాని ఈ టాపిక్ మీద చర్చలైతే జోరుగా సాగుతున్నాయి. ఆగస్ట్ 23 ప్లాన్ చేసిన ఎవరు ఏకంగా సాహోకు కేవలం వారం రోజుల గ్యాప్ తో వస్తోంది