Begin typing your search above and press return to search.
శేష్ ను నమ్ముకుంటే లాభాలే లాభాలు
By: Tupaki Desk | 24 Aug 2019 1:30 AM GMTవిలక్షణ హీరో.. నటుడిగా గుర్తింపు దక్కించుకున్న అడవి శేష్ మినిమం గ్యారెంటీ హీరోగా పేరు దక్కించుకున్నాడు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథాంశాలను ఎంచుకుని ఈ కుర్ర హీరో చేస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను దక్కించుకుని నిర్మాతలకు లాభాలను తెచ్చి పెడుతున్నాడు. తాజాగా ఈయన 'ఎవరు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా రెజీనా నటించింది.
ఈ చిత్రం పూర్తి బడ్జెట్ 5 కోట్లుగా సమాచారం అందుతోంది. సినిమాకు వచ్చిన బజ్ తో అన్ని ఏరియాలకు కలిపి దాదాపుగా 10 కోట్ల వరకు బిజినెస్ చేసింది. పెట్టిన పెట్టుబడి డిజిటల్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారానే రాబట్టిన ఈ చిత్రం విడుదలైన తర్వాత మంచి టాక్ ను దక్కించుకున్న కారణంగా సినిమా మొదటి వారం రోజుల్లో దాదాపుగా 9 కోట్లకు పైగా షేర్ ను దక్కించుకుంది. ఒకటి రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించబోతుంది.
ఈ వారంలో విడుదలైన సినిమాల్లో ఏవీ పెద్దగా ప్రభావం చూపించలేక పోతే 'ఎవరు' చిత్రం 'సాహో' వచ్చే వరకు జోరును కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే భారీగా వసూళ్లు నమోదు చేయవచ్చు. రాబోయే కలెక్షన్స్ విషయాన్ని పక్కన పెట్టినా ఇప్పటికే వచ్చిన కలెక్షన్స్ ను బట్టి చూస్తే సినిమాకు డబుల్ ఫ్రాఫిట్ ను నిర్మాతలు దక్కించుకున్నారు. 5 కోట్ల పెట్టుబడికి 15 కోట్ల వరకు నిర్మాతల ఖాతాలోకి వచ్చింది. అందుకే శేష్ తో సినిమా చేస్తే మినిమం లాభాలు గ్యారెంటీ అంటూ నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. శేష్ గత చిత్రాల ఫలితాలను పరిశీలించినా ఇదే విధంగా ఉంది. సినిమాలు సక్సెస్ కాకున్నా కూడా తక్కువ బడ్జెట్ సినిమాలే శేష్ చేస్తున్న కారణంగా మినిమం లాభాలు నిర్మాతలు రావడం కన్ఫర్మ్.