Begin typing your search above and press return to search.
టాలీవుడ్ బతకాలంటే మరింతమంది అడివి శేష్ లు రావాలి
By: Tupaki Desk | 31 May 2022 3:30 PM GMTటాలీవుడ్ ఇప్పుడో విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుంది. కరోనా తర్వాత విడుదలైన పెద్ద సినిమాలు కొన్ని బంపర్ హిట్లు కొట్టేస్తే.. మరికొన్ని దారుణ డిజాస్టర్ గా మారాయి. ఏళ్లకు ఏళ్లుగా అంచనాలున్న క్రేజీ మూవీలను చూసేందుకు సైతం థియుటర్ల వైపు కన్నెత్తి చూసేందుకు ఇష్టపడలేదు. గతంలో దారుణమైన ప్లాప్ మూవీ అన్నప్పటికి కనీసం వారం పాటు ఒక మోస్తరు కలెక్షన్లు ఉండేవి. అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం 'బాగోలేదు' అన్న టాక్ వచ్చినంతనే థియేటర్ వైపుకు రావటానికి సొంత అభిమానులు సైతం ఇష్టం పడటం లేదు.
ఎందుకిలా? అన్నదిప్పుడు కోటిరూకల ప్రశ్నగా మారింది. దీనికి మొదటి సమాధానం టాలీవుడ్ అగ్ర హీరోలు.. దర్శక నిర్మాతల కక్కుర్తి.. వారి దురాశగానే చెప్పుకోవాలి. సినిమా బడ్జెట్లను భారీగా పెంచేసుకొని.. నెలల తరబడి సాగదీయటం ద్వారా నిర్మాణ ఖర్చుల్ని భారీగా పెంచేసుకున్నారు. అవసరానికి మించిన ఆడంబరాలకు పోయి భారీ బడ్జెట్ సినిమాలుగా మార్చేశారు. దీనికి ప్రతిగా.. పెట్టిన ప్రతి పైసాకు రూపాయి చొప్పున ప్రేక్షకుల నుంచి లాగేయాలన్న దురాశ.. ఇప్పుడు టాలీవుడ్ దు:ఖానికి దారి తీసింది.
కరోనాకు ముందు ఇప్పటి పరిస్థితికి చూస్తే.. అప్పట్లో మల్టీఫ్లెక్సుల్లో టికెట్ ధర రూ.137 నుంచి రూ.150 ఉంది. అది కాస్తా ఇప్పుడు రూ.295 నుంచి రూ.400 వరకు చేశారు. అంటే.. ఒక సినిమా టికెట్ ధర రెట్టింపు .. రెండున్నర రెట్లకు పెరిగిపోయింది. ఇంత భారీగా ధర పెరిగినప్పుడు.. ప్రేక్షకుడు సినిమాలను ఎందుకు ఆదరిస్తాడు? కొత్త సినిమాలు మహా అయితే నాలుగు వారాలు లేదంటే ఒకటిన్నర నెలలోనే ఓటీటీలో విడుదలవుతున్నాయి. కరోనా పుణ్యమా అని ఇవాల్టి రోజున ఇళ్లల్లోకి పెద్ద పెద్ద స్క్రీన్లతో టీవీలు వచ్చేశాయి.
సినిమా థియేటర్ ఫీల్ ఉండదు కానీ.. అందులో సగమైనా ఫీలయ్యే పరిస్థితి ఇంట్లో ఉంది. ఫ్యామిలీ మొత్తం ఈరోజున సినిమాకు వెళ్లాలంటే కనీసం.. రూ.2వేల వరకు ఖర్చు చేయక తప్పట్లేదు. అలా ఏం కాకుండా సినిమాకు వెళ్లి.. మళ్లీ ఇంటికి వచ్చే వరకు నోరు కట్టేసుకుంటే వెయ్యితో పూర్తి చేయొచ్చు. కానీ.. అదంత తేలికైన విషయం కాదు. ఇదంతా ఎందుకు అసలు సినిమాకు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా? అనే వరకు తెలుగు ప్రేక్షకుడు వెళ్లాడు.
తమ సినిమాకు హైప్ తీసుకొచ్చి మొదటి మూడు రోజుల్లోనే భారీగా లాభాలు దండుకోవటానికి వీలుగా టికెట్ల ధరల్ని పెంచేసి.. థియేటర్ల సంఖ్యను పెంచేయటం ద్వారా భారీగా సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. ఎంత సినిమా బాగున్నా.. ఒక మోస్తరు సినిమాల కోసం సినీ ప్రేమికుడు తన బడ్జెట్ మీద భారం వేసుకోడు కదా? అందుకే సినిమాల విషయంలో అతనిప్పుడో నిర్ణయానికి వచ్చాడు. ఎంతో బాగుందన్న సినిమాలకే వెళ్లేలా అది కూడా.. ఆచితూచి అన్నట్లుగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని బాగానే స్టడీ చేసినట్టున్నాడు అడివి శేష్. తన తాజా 'మేజర్' చిత్రానికి టికెట్ల ధరల్ని తగ్గించాలని దర్శక నిర్మాతల్ని కోరటం.. ధియేటర్ల వారిని ప్రత్యేకంగా కోరటంతో.. వారికి పరిస్థితి అర్థమై ఓకే చేశారు.
తగ్గించిన టికెట్ల ధరల్ని అడివి శేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. దీని అర్థం ఏమిటంటే.. మంచి సినిమా చూపిస్తాం.. మీ మీద భారం వేయం.. టికెట్ల ధరల్ని తగ్గించామన్న సందేశాన్ని ఇచ్చేశారు. నిజంగానే టాలీవుడ్ మంచి కోరుకునే హీరోలు.. దర్శక నిర్మాతలు ఎవరైనా సరే టికెట్ల ధరల్ని తక్షణం తగ్గించకుంటే.. దారుణ పరిస్థితులు ఎదురుకావటం ఖాయం. అందుకే.. టాలీవుడ్ కు ఇప్పుడు మరింతమంది 'అడవి శేష్'లు అవసరం ఉంది. మరీ విషయం టాలీవుడ్ పెద్దలు ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.