Begin typing your search above and press return to search.
ఆ తప్పు మళ్లీ చేయను.. బాలీవుడ్ కు నిజమే
By: Tupaki Desk | 17 Sep 2018 4:56 AM GMTవిభిన్న చిత్రాల హీరోగా గుర్తింపు దక్కించుకున్న అడవి శేషు తాజాగా ‘గూఢచారి’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ‘క్షణం’ మరియు ‘గూఢచారి’ చిత్రాల్లో హీరోగా నటించడంతో పాటు ఆ చిత్రాలకు రచయిత వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే రైటర్‌గా కూడా వర్క్ చేయడం జరిగింది. నటుడిగా మంచి పేరు దక్కించుకోవడంతో పాటు రైటర్ గా కూడా అడవి శేషుకు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం హీరోగా నటిస్తూనే మరో వైపు రచయితగా కొనసాగుతూ వస్తున్నాడు. అయితే దర్శకత్వం అంటే మాత్రం కాస్త వెనుకంజ వేస్తున్నాడు.
గతంలో అడవి శేషు ‘కర్మ’ మరియు ‘కిస్’ చిత్రాల్లో నటించడంతో పాటు ఆ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అయితే ఆ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి. ఆ రెండు సినిమాలు తనకు పెద్ద గుణపాఠం నేర్పాయి అంటున్న అడవి శేషు ఇకపై తాను నటించే సినిమాలకు దర్శకత్వం వహించను - దర్శకత్వం వహించే సినిమాల్లో నటించను అంటూ తేల్చి చెప్పాడు. నటన మనసు పెట్టి నటించాలి - దర్శకత్వం మైండ్ తో చేయాల్సి ఉంటుంది. రెండు పనులు ఒకేసారి చేయాలని ప్రయత్నించి తప్పు చేశాను. ఇకపై మళ్లీ ఆ తప్పు చేయను అంటూ అడవి శేషు చెప్పుకొచ్చాడు.
‘క్షణం’ చిత్రం తర్వాత తనకు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వచ్చాయని - బాలీవుడ్ కోసం తాను 2008లో ఒక కథ రాసుకున్నాను. తాను రాసుకున్న ఆ దేశభక్తి కథ అక్కడి వారికి నచ్చిందని, త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన వివరాలు వెళ్లడి చేస్తానని, ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ అంటూ అడవి శేషు అంటున్నాడు. గూఢచారి సిరీస్ లో వరుసగా చిత్రాలు చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చిన అడవి శేషు త్వరలోనే తన కొత్త సినిమాకు సంబంధించిన కీలక విషయాన్ని ప్రకటిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.