Begin typing your search above and press return to search.
వైరల్ ట్వీట్.. నేను కమల్ ఫ్యాన్ నైనా 'మేజర్' చూస్తాను
By: Tupaki Desk | 19 Jun 2022 5:31 AM GMTఅడవి శేష్ హీరోగా రూపొందిన మేజర్ సినిమాకు మంచి స్పందన వచ్చింది. రియల్ హీరో మేజర్ సందీప్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'మేజర్' సినిమా కు పోటీ అన్నట్లుగా కమల్ హాసన్ మూవీ 'విక్రమ్' విడుదల అయిన విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఖాయం అనుకున్నారు. అయితే రెండు సినిమాలు కూడా దేనికి అది అన్నట్లుగా మంచి వసూళ్లను రాబట్టాయి.
మేజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో అడవి శేష్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. వారితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ సినిమా ను అన్ని విధాలుగా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నాడు. తాజాగా ఒక ట్వీట్ కు అడవి శేష్ ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది.. ఆ ట్వీట్ వైరల్ అయ్యింది.
భరనింధర్ రాజు అనే వ్యక్తి ట్విట్టర్ లో... నేను కమల్ హాసన్ కు గొప్ప అభిమానిని. ఒక వేళ మీరు నన్ను విక్రమ్ ముందు చూస్తావా లేదా మేజర్ ముందు చూస్తావా అంటూ ప్రశ్నిస్తే ఖచ్చితంగా నేను విక్రమ్ సినిమా కంటే ముందు మేజర్ సినిమాను చూస్తాను అంటూ సమాధానం చెప్తాను. ఆ తర్వాతే కమల్ హాసన్ సర్ నటించిన విక్రమ్ సినిమాను చూస్తాను అన్నట్లుగా ట్వీట్ చేశాడు.
ఆ ట్వీట్ కు అడవి శేష్ స్పందించాడు. నేను ఆ రెండు సినిమాలు చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నేను కూడా కమల్ హాసన్ సర్ కి గొప్ప అభిమానిని మీతో పాటు అన్నట్లుగా ట్వీట్ చేశాడు. ట్విట్టర్ లో వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఒకే రోజు విడుదల అయిన విక్రమ్ మరియు మేజర్ సినిమాలు ఆయా జోనర్ ల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.