Begin typing your search above and press return to search.
టాప్ రేటెడ్ తెలుగు చిత్రాల జాబితాలో శభాష్ అనిపించుకున్న శేష్..!
By: Tupaki Desk | 16 Oct 2022 3:49 AM GMTప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలయ్యే సినిమాలకు అంతర్జాతీయ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ - IMDB) ద్వారా యూజర్లు ఆన్ లైన్ రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇందులో టాప్ రేటింగ్ పొందిన జాబితాలో మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.
IMDB పోర్టల్ లో అత్యధిక రేటింగ్ పొందిన టాప్-25 తెలుగు చిత్రాలను పరిశీలిస్తే.. 'మాయాబజార్' 'C/o కంచరపాలెం' మరియు 'జెర్సీ' వంటి చిత్రాలు 8.3 రేటింగ్ తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇదే జాబితాలో యంగ్ హీరో అడివి శేష్ నటించిన మూడు సినిమాలు ఉండటం గమనార్హం.
'క్షణం' సినిమా 7.9 రేటింగ్స్ తో 17వ స్థానంలో ఉండగా.. 'ఎవరు' చిత్రం 18వ స్థానంలో ఉంది. అలానే 'మేజర్' మూవీ 22వ స్థానంలో నిలిచాయి. అయితే ఈ మూడు సినిమాలు కూడా ఐఎండీబీ పోర్టల్ లో 7. 9 రేటింగ్ దక్కించుకోవడం విశేషం.
వర్సటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్.. మొదటి నుంచి కూడా స్క్రిప్ట్స్ ఎంపికలో వైవిద్యం చూపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పుడు ఐఎండీబీలో టాప్ లో ఉన్న సినిమాలకు శేష్ స్వయంగా కథ అందించడం విశేషం.
అయితే IMDB రేటింగ్స్ ని ప్రామాణికంగా తీసుకొని బెస్ట్ తెలుగు సినిమాలను నిర్ణయించడం సరైనదేనా అనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తెలుగులో అనేక మంచి చిత్రాలు - విశేష జనాదరణ పొందిన కల్ట్ క్లాసిక్స్ ఉన్నాయి. కానీ అవేమీ టాప్-25 లిస్టులో స్థానం సంపాదించలేదు.
ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద చిత్ర పరిశ్రమలలో టాలీవుడ్ ఒకటి. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్స్ - సైన్స్ ఫిక్షన్ - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలు మరియు పౌరాణిక చిత్రాలను అందిస్తోంది. ఈ క్రమంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా టాలీవుడ్ అతిపెద్ద పరిశ్రమగా అవతరించింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రాలు IMDB రేటింగ్స్ లోనూ సత్తా చాటాయని అనుకోవచ్చు. కాకపోతే ఐఎండీబీని కొంతమంది భారతీయ సినీ అభిమానులు మాత్రమే అనుసరిస్తుంటారు. వారిలో ఎక్కువ మంది NRIలు ఉన్నారు.
ఇప్పుడు IMDB పోర్టల్ లోని టాప్-25 జాబితాని ఆ సర్కిల్ ఆఫ్ యూజర్స్ ఓట్లతో డిసైడ్ చేసిన లిస్ట్ గా పరిగణించాలి తప్పితే.. మెజారిటీ తెలుగు సినిమా లవర్స్ కి ఆ పోర్టల్ గురించి పెద్దగా తెలియలేదు. ఒక సెక్షన్ ఓటర్లు మాత్రమే నిర్ణయించారు కాబట్టి ఆ లిస్ట్ ని ఖచ్చితమైనదిగా భావించలేమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏదేమైనా అడివి శేష్ తన స్క్రిప్ట్ సెలక్షన్ తో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు. 'మేజర్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఓ వర్గం సినీ ప్రియులు డిసైడ్ చేసినా.. IMDBలో టాప్-25 జాబితాలో 3 చిత్రాలను కలిగి ఉన్న ఏకైక నటుడు అడివి శేష్ అని చెప్పాలి. ఇప్పుడు యువ హీరోకి పలు బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.