Begin typing your search above and press return to search.

ఇది కాపీనా.. స్ఫూర్తినా శేష్‌?

By:  Tupaki Desk   |   18 July 2019 1:30 AM GMT
ఇది కాపీనా.. స్ఫూర్తినా శేష్‌?
X
వ‌రుస‌గా కాపీ క్యాట్ వివాదాలు టాలీవుడ్ లో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఈ శుక్ర‌వారం రిలీజ్ కి రెడీ అవుతున్న `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రం ఓ కొరియ‌న్ సినిమా కాపీ అని.. కాదు అమెరిక‌న్ క్రైమ్ డ్రామాకు కాపీ అని ప్ర‌చార‌మైంది. ఓ వైపు మీడియా ప్ర‌మోష‌న్స్ లో చిత్ర‌యూనిట్ మీడియా ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఇవ్వాల్సి వ‌స్తోంది. ఇస్మార్ట్ శంక‌ర్ ఎలాంటి కాపీ కాద‌ని .. కేవ‌లం మెమ‌రీ చిప్ అన్న పాయింట్ ని హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తిగా తీసుకున్నామ‌ని పూరి- రామ్ అండ్ టీమ్ చెబుతున్నారు. క‌థ ప‌రంగా ఇది వోన్ గా రాసుకున్న‌దేన‌న్న‌ది వారి వాద‌న‌.

ఈ వివాదంతో ఆగిపోలేదు. మునుముందు రిలీజ్ కి వ‌స్తున్న సినిమాల‌కు ఈ ముప్పు పొంచి ఉంది. ఆగ‌స్టు 15న రిలీజ్ కి వ‌స్తున్న అడివి శేష్ `ఎవ‌రు?` చిత్రంపైనా కాపీ క్యాట్ వివాదం తాజాగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ సినిమాని స్పానిష్ మూవీ `ది ఇన్ విజిబుల్ గెస్ట్` ఆధారంగా తెర‌కెక్కించార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇదివ‌ర‌కూ `ఎవ‌రు?` పోస్ట‌ర్ రిలీజ్ కాగానే ఇదో హాలీవుడ్ సినిమా కాపీ అన్న విమ‌ర్శ‌లు చేశారు కొంద‌రు. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ వెంక‌ట్ రాంజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌ణం త‌ర్వాత శేష్ తో పీవీపీ బ్యాన‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రెజీన క‌థానాయిక‌. సాహో రిలీజ్ వాయిదా అన‌గానే ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్నామ‌ని టీమ్ ప్ర‌క‌టించింది.

అయితే స్పానిష్ మూవీ ది ఇన్ విజిబుల్ గెస్ట్ స్ఫూర్తితో ఇప్ప‌టికే ప‌లు భాష‌ల్లో సినిమాలొచ్చాయి. బాలీవుడ్ లోనూ `బ‌ద్లా` (తాప్సీ-అమితాబ్) చిత్రం ఈ సినిమా స్ఫూర్తితోనే తెర‌కెక్కి క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకుంది. మునుముందు రాబోతున్న సినిమాల‌పైనా ఈ త‌ర‌హా వివాదాలు త‌ప్పేట్టు లేవు. తెలుగు సినిమాల‌కు ఎక్కువ‌గా కొరియ‌న్ సినిమాల స్ఫూర్తి క‌నిపిస్తోంది. అలాగే ప‌లు భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాల స్ఫూర్తి అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తోంది. ఏదో ఒక క్యారెక్ట‌ర్ లేదా ఏదో ఒక సీన్ ని అయినా మ‌న ద‌ర్శ‌కులు స్ఫూర్తిగా తీసుకుంటున్న సంద‌ర్భాలు అనేకం బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కాపీకి.. స్ఫూర్తికి మ‌ధ్య స‌న్న‌ని లైన్ గురించి ప్ర‌తిసారీ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతూనే ఉంది.