Begin typing your search above and press return to search.
ఎవరుకి ప్రమోషన్ ఎప్పుడు?
By: Tupaki Desk | 31 July 2019 2:30 PM GMTఇంకో రెండు వారాల్లో అడవి శేష్ ఎవరు విడుదల కాబోతోంది. సాహో ఆగస్ట్ 15ని వదిలేసుకోవడంతో శర్వానంద్ రణరంగం అడవి శేష్ ఎవరులు ఆ స్లాట్ ని లాక్ చేసుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో అంతకు రెట్టించిన శ్రమ పబ్లిసిటీ కోసం చేయాల్సి వస్తోంది. ఈ విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనకు పోటీగా ఉన్నవాళ్లు అవకాశాలు లాగేసుకుంటారు. కానీ ఎవరు టీమ్ ఎందుకో మరి సైలెంట్ గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
అడవి శేష్ గత రెండు సినిమాలు క్షణం - గూఢచారి కమర్షియల్ గానూ క్రిటికల్ గానూ అన్ని రకాలుగా వర్క్ అవుట్ అయ్యాయి. కానీ విచిత్రంగా వాటి ప్రభావం ఎవరు మీద లేకపోవడం గమనించాల్సిన అంశం. టీజర్ ఆకట్టుకునేలా థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ అయితే ఇవ్వగలిగేలా కట్ చేశారు కానీ రేపు థియేటర్ దాకా ప్రేక్షకులను రప్పించే స్థాయిలో పబ్లిసిటీ మెటీరియల్ డిజైన్ చేశారా అంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. పివిపి లాంటి పెద్ద సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇలా చేయడం వింతే. రెజీనాను హై లైట్ చేస్తున్నారు కానీ తను ఇప్పుడు ఫామ్ లో లేదు.
కేవలం కంటెంట్ మీద ఆధారపడి ఎవరు ఆడాలి తప్పించి శేష్ బ్రాండ్ మీదో రెజీనా పేరుమీదో కలెక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు. అసలే రణరంగంతో పోటీ. శర్వానంద్ ఇమేజ్ తో పాటు యాక్షన్ థీమ్ కాజల్ అగర్వాల్ గ్లామర్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రెజెన్స్ ఇవన్నీ ప్లస్ గా నిలుస్తున్నాయి. కానీ ఎవరు ఎంతసేపూ శేష్ మీదే ఆధారపడుతోంది. మరి చేతిలో ఉన్న రెండు వారాలను సరిగ్గా ఉపయోగించుకుని ఎవరు స్పీడ్ ని పెంచకపోతే రేపు రిలీజయ్యాక ప్రేక్షకులు ఈ సినిమా గురించి విని ఎవరు తీసింది అని అడిగే ప్రమాదం లేకపోలేదు.