Begin typing your search above and press return to search.
'గూఢచారి 2' అప్ డేట్స్
By: Tupaki Desk | 10 Nov 2018 7:48 AM GMTచిన్న బడ్జెట్ తో తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘గూఢచారి’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అడవి శేషు ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న గూఢచారి చిత్రంకు సీక్వెల్ రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా చివర్లోనే సీక్వెల్ ఉంటుందని దర్శకుడు శశికిరణ్ తిక్క హింట్ వదిలాడు. గూఢచారికి కథను అందించిన అడవి శేషు ప్రస్తుతం సీక్వెల్ కు కథను సిద్దం చేస్తున్నాడు.
గూఢచారికి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అడవి శేషు కథను సిద్దం చేసేందుకు చాలా కష్టపడుతున్నాడు. మొదటి పార్ట్ లోని పాత్రలను కంటిన్యూ చేస్తూ కథను సాగించే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. గూఢచారి సినిమాలోని ప్రకాష్ రాజ్ మరియు సుప్రియ లు పోషించిన సత్య - నదియా ఖురేషి పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఆ పాత్రలను రెండవ పార్ట్ లో కూడా కంటిన్యూ చేయబోతున్నాడు. హీరో పాత్ర విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
మొదటి పార్ట్ కు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా - రెండవ పార్ట్ కు రాహుల్ పాకాల దర్శకత్వం వహించే అవకాశం ఉందట. అడవి శేషుకు శశి కిరణ్ తిక్కతో పాటు రాహుల్ పాకాల కూడా మంచి స్నేహితులు. మొదటి పార్ట్ స్క్రిప్ట్ వర్క్ లో రాహుల్ పాకాల కీలక పాత్ర పోషించాడని - రెండవ పార్ట్ కు రాహుల్ అయితే న్యాయం చేస్తాడని అడవి శేషు భావిస్తున్నాడట. త్వరలోనే కథ సిద్దం అయితే సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నారట. మొదటి పార్ట్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యేనో చూడాలి.