Begin typing your search above and press return to search.
అబ్బో... యాభై కథలకి నో చెప్పాడట!
By: Tupaki Desk | 1 Aug 2018 2:25 PM GMTఅడవి శేష్ లో మంచి నటుడే కాదు.. మంచి కథకుడు కూడా ఉన్నాడని `క్షణం`తో రుజువైంది. మొదట్నుంచీ కూడా ఆయనకి దర్శకత్వంపై మక్కువ ఉంది. అందుకే కిస్ పేరుతో ఓ సినిమాని తీశాడు. ఆ సినిమా ఏమాత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దాంతో అప్పట్నుంచి కేవలం నటనపైనే దృష్టిపెట్టాడాయన. అయితే కథలు రాసుకోవడం మాత్రం మానలేదు. సరైన సమయం చూసుకొని తన కథతో `క్షణం` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. పీవీవీ సంస్థ నిర్మించిన ఆ సినిమాకి అన్నీ తానై వ్యవహరించాడు శేష్. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో అడవిశేష్ కి మంచి పేరొచ్చింది. ఆ కథ హిందీలోనూ రీమేకై మంచి వసూళ్లు సాధించింది.
అయితే ఈచిత్రం తర్వాత అడవిశేష్ కి వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయట. ఎంతగా అంటే యాభై కథలకి శేష్ నో చెప్పాడట. ఒక నిర్మాత అయితే మరీ ఎక్కువ చేస్తున్నావని అన్నాడట. కానీ శేష్ మాత్రం మనసుకు నచ్చిన సినిమాలే చేస్తానని చెప్పాడట. ఆ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడాయన. ఆచితూచి ఎట్టకేలకి అమీతుమీలో నటించాడు. ఆ చిత్రం కూడా విజయవంతం కావడంతో శేష్ కి క్రేజ్ ఏర్పడింది. ఇటీవలే క్షణంలాగే తన కథతోనే గూఢచారి చేశాడు. మరి ఆ చిత్రం రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే. అడవిశేష్ మాత్రం ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.