Begin typing your search above and press return to search.

క్రెడిట్ మ్యాట‌ర్స్‌ పై శేష్ ఏమంటారో!

By:  Tupaki Desk   |   10 Aug 2019 1:33 AM GMT
క్రెడిట్ మ్యాట‌ర్స్‌ పై శేష్ ఏమంటారో!
X
హీరో.. రైట‌ర్.. డైరెక్ట‌ర్.. క్రియేట‌ర్ .. ఇలా అన్నిటినీ ఒక్క‌రే ఖాతాలో వేసేసుకుంటే ఇత‌రులు హ‌ర్ట‌వ్వ‌డం మామూలే. క్ష‌ణం.. గూఢ‌చారి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టిన‌ప్పుడు రైట‌ర్ కం డైరెక్ట‌ర్ కం హీరో అడివి శేష్ ఘ‌న‌త ఇదంతా అని ప్ర‌చారం సాగింది. ఏ ఈవెంట్ జ‌రిగినా శేష్ ని ప్ర‌ధానంగా హైలైట్ చేస్తూ ప‌లువురు పొగిడేశారు. వేదిక‌ల‌పై హీరోయిన్లు సైతం శేష్ ముందు క‌నిపించ‌రు అదేంటో! కార‌ణం ఏదైనా అది అత‌డికి ప్ర‌త్యేక గుర్తింపునే తెచ్చింది. ప్ర‌తిభావంతుడిని ఎవరైనా గుర్తిస్తారు. అభిమానిస్తారు. ప్ర‌చారం కూడా చేసి పెడ‌తార‌న‌డానికి శేష్ పెద్ద ఎగ్జాంపుల్.

అయితే ఇలా అన్నిటినీ మీ ఖాతాలోకే మ‌ల్లించేస్తే ఎలా? అని ప్ర‌శ్నిస్తే మాత్రం శేష్ ఎంతో విన‌మ్రంగా సమాధాన‌మిస్తాడు. ఆగ‌స్టు 15న రిలీజ్ కి వ‌స్తున్న `ఎవ‌రు` క్రెడిట్ ఎవ‌రికి ఇస్తారు అన్న‌ది ప్ర‌స్తుతానికి అలా ఉంచితే.. ప్ర‌చార వేదిక‌ల‌పై ఇప్ప‌టికే శేష్ మాయాజాలం క‌నిపిస్తోంది.

ఈ సినిమా త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ నిర్మాణ సంస్థ‌లో `మేజ‌ర్` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు శేష్‌. ఈ చిత్రానికి `గూఢ‌చారి` ఫేం శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శేష్ - శ‌శి జోడీ తిరిగి త‌మ ల‌క్కీ ఛామ్ అయిన‌ తెలుగ‌మ్మాయి శోభిత ధూళిపాల‌ను వెన‌క్కి తెస్తారా లేదా? అన్న‌ది చూడాలి. గూఢ‌చారిలో శేష్ న‌ట‌న‌తో పాటు శోభిత న‌ట‌న‌కు పేరొచ్చింది. అందుకే ఆ పేరు మ‌రోసారి వినిపిస్తోంది. ఇక‌పోతే మేజ‌ర్ చిత్రంతో అడివి శేష్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రాన్ని జాతీయ స్థాయిలో మ‌హేష్ నిర్మిస్తున్నారు. తెలుగు- హిందీలోనూ రిలీజ్ చేయ‌నున్నారు. `ఎవ‌రు` త‌ర్వాత వెంట‌నే ఈ సినిమాని ప‌ట్టాలెక్కించేందుకు శేష్ రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఏ సినిమా చేసినా త‌న షేర్ ని మాత్ర‌మే ఖాతాలో వేసుకుని ఎవ‌రికి ద‌క్కాల్సిన‌ది వారికి వ‌దిలేయ్ శేషూ భ‌య్యా! అంటూ ప‌లువురు అభ్య‌ర్థిస్తున్నారు. ఇంత‌కీ `ఎవ‌రు` క్రెడిట్ ఎవ‌రి ఖాతాలో వేస్తారో చూడాలి.