Begin typing your search above and press return to search.
పోస్టర్లకు వాడిన మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!
By: Tupaki Desk | 15 Aug 2019 1:30 AM GMT'క్షణం'.. 'గూఢచారి' లాంటి విజయవంతమైన సినిమాలతో అడివి శేష్ తనకంటూ ఒక గుర్తింపు సాధించాడు. దీంతో శేష్ సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..ఈ గురువారమే శేష్ తన కొత్త సినిమా 'ఎవరు' తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.. ఈ ఈవెంట్ లో శేష్ స్పీచ్ కాస్త ఎమోషనల్ గా సాగింది.
'క్షణం'.. 'గూఢచారి' తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందని అన్నాడు శేష్. ముఖ్యంగా 'గూఢచారి' రిలీజ్ సమయంలో చాలామంది హీరోలు తనకు సహకరించారని తెలిపాడు. "అల్లు అర్జున్ గారు 'గూఢచారి' గురించి ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు గారు సినిమా బాగుందంటూ ట్విట్టర్ ద్వారా మెచ్చుకున్నారు. నాగార్జున గారు తన సినిమా ప్రమోషన్ పక్కన పెట్టి మరీ 'గూఢచారి' గురించి గొప్పగా మాట్లాడారు. రాహుల్ రవీంద్రన్ మా సినిమా సక్సెస్ మీట్ కు వచ్చి అభినందించారు" అని గుర్తు చేసుకున్నాడు శేష్. హీరోలే కాదు.. ప్రతి దశలో చాలామంది తనకు అండగా నిలిచారన్నాడు. ఫ్రెండ్స్.. ఇండస్ట్రీలో తోటి నటులు.. మీడియా వారు అందించిన సహకారం మరిచిపోలేనని అంటూ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు.
ఇండస్ట్రీలో నేర్చుకున్న గుణపాఠాన్ని గురించి ప్రస్తావిస్తూ తన 'కిస్' సినిమా సంగతి చెప్పాడు. ఆ సినిమా రిలీజ్ కు ముందు కొందరు హీరో ఇలా ఉండాలి.. సినిమాలో కమర్షియల్ అంశాలు ఇలా ఉండాలని తనకు లేనిపోనివి చెప్పి మిస్ గైడ్ చేశారని అన్నాడు. కానీ ఆ సినిమాపై పెట్టిన పెట్టుబడి ఒక్క పైసా కూడా వెనక్కు రాలేదన్నాడు. నిజానికి 'పైసా' పోస్టర్లకు వాడిన మైదా పిండి ఖర్చులు కూడా రాలేదంటూ ఓపెన్ గా తన సినిమా పరిస్థితిని ఏకరువు పెట్టాడు. రెండు కోట్లు నష్టపోయామని.. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిన కావడంతో కోలుకోలేకపోయానని చెప్పాడు. 'కిస్' తో తన జీవితం ఒక్కసారిగా తిరగ బడిందని.. అద్దె కట్టేందుకు కూడా డబ్బు లేదన్నాడు. అయితే అలాంటి పరిస్థితుల నుంచే పాఠాలు నేర్చుకున్నానని చెప్పాడు.
'కిస్' సినిమాతో తన జడ్జిమెంట్ దెబ్బ తిన్నదని.. కాకపోతే 'క్షణం' సినిమా సమయానికి తనకు పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగిందని.. ఎవరి నుంచి సలహాలు తీసుకోవాలో... ఎవరి నుంచి సలహాలు తీసుకోకూడదు అనే విషయం పై క్లారిటీ వచ్చిందని తెలిపాడు. 'ఎవరు' గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.