Begin typing your search above and press return to search.

అడివి శేష్ చేసిన కర్మపై పవన్ అలా అన్నారట!

By:  Tupaki Desk   |   1 Sep 2019 5:03 AM GMT
అడివి శేష్ చేసిన కర్మపై పవన్ అలా అన్నారట!
X
ఇప్పుడంటే అడివి శేష్ టాలీవుడ్ లో సంచలనం. ఆయన చేసే సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయ్. ఒకప్పుడు అవకాశాల కోసం తిరిగిన అడివి శేష్ దగ్గరకు ఇప్పుడు ఛాన్సులు పలుకరిస్తూ వస్తున్నాయి. హీరోగా.. దర్శకుడిగా తొలి ప్రయత్నం కర్మ మూవీతో శేష్ మొదలెట్టారు. మరి.. దీనికి ఫైనాన్స్ ఎవరు చేశారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

తనను ఎవరూ హీరోగా.. దర్శకుడిగా పరిచయం చేయలేదని.. తనకు తానుగా చేసుకున్న ప్రయత్నమేనని చెప్పారు. తాను దాచుకున్న డబ్బులతో పాటు.. అమ్మానాన్నలు ఇచ్చిన డబ్బులతో.. స్నేహితుల సహకారంతో కర్మ మూవీని తీసినట్లు చెప్పారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నా.. ప్రేక్షకులు మాత్రం లైట్ తీసుకోవటం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ సినిమాతో బాధలో మునిగిపోయిన అడివి శేష్ కు.. ఆ సినిమాలో టైటిల్ సాంగ్ లో స్టైల్ నచ్చి పంజా సినిమాలో మున్నా క్యారెక్టర్ దక్కిందని చెప్పారు.

పంజా షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్ టీవీలో కర్మ మూవీని చూసినట్లు చెప్పారు. ఆ సినిమా చూసిన తర్వాత పవన్ స్పందిస్తూ.. ఇలాంటి సినిమాలు చేయటం మాత్రం మానకంటూ చెప్పిన మాటల్ని తానెప్పటికి మర్చిపోలేనన్నారు. లీడ్ క్యారెక్టర్ చేయాలన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి మరీ కిస్ సినిమా చేసినట్లు చెప్పారు.

బయట వాళ్ల మాటల ప్రభావంతో పడి.. తన అభిరుచికి భిన్నంగా సినిమా తీయటం.. దాని పోస్టర్లకు అంటించిన మైదా పిండికి అయిన ఖర్చు కూడా రాలేదన్నారు. ఈ సినిమాతో అప్పులవాళ్లు అడగటం.. నిజాయితీతో చెప్పిన సమాధానాల్ని మర్చిపోలేనన్నారు.