Begin typing your search above and press return to search.
గూఢచారికి ఓటేసిన సమంత!
By: Tupaki Desk | 9 Feb 2019 10:41 AM GMTపెళ్లి తర్వాత సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటికే 'యూటర్న్' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' రీమేక్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులే అయినా కూడా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలను అధికారికంగా బయటకు వెళ్లడించలేదు. షూటింగ్ ప్రారంభించిన విషయం కూడా బయటకు చెప్పలేదు. ఈ చిత్రానికి బేబీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్రకు అడవి శేషును ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.
'బేబీ' చిత్రంలో కీలక పాత్రల్లో లక్ష్మీ మరియు రాజేంద్ర ప్రసాద్ లు నటిస్తున్నారు. ఇక మరో కీలకమైన గెస్ట్ రోల్ లో అడవి శేషు నటిస్తే బాగుంటుందని స్వయంగా సమంత సలహాతో నందిని రెడ్డి కూడా ఆయన్నే ఎంపిక చేసేందుకు సిద్దం అయ్యింది. పాత్ర ఎంతది అయినా కూడా అడవి శేషు తనకు నచ్చితే చేసేందుకు వెనుకాడడు. అందుకే ఈ పాత్రను ఆయనతో చేయించడం బెటర్ అనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం గూఢచారి చిత్రం సీక్వెల్ పనిలో ఉన్న అడవి శేషు మరో వైపు రాజశేఖర్ కుమార్తె శివానీ హీరోయిన్ గా పరిచయం కాబోతున్న మూవీలో కూడా నటిస్తున్నాడు.
దర్శకుడిగా, రచయితగా మంచి పేరు దక్కించుకున్న అడవి శేషు హీగారో కూడా అలరించాడు. బేబీ చిత్రంలో శేషు కోసమే అన్నట్లుగా ఆ పాత్ర ఉంటుందని అందుకే సమంత దర్శకురాలు నందిని రెడ్డిని కన్విన్స్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. సమ్మర్ చివరి వరకు సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలనే ఉద్దేశ్యంలో నందిని రెడ్డి ఉంది. ఈ చిత్రం గురించి ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నీ కూడా యూనిట్ సభ్యుల నుండి ప్రకటన వస్తే కాని క్లారిటీ అవ్వవు. సమంతకు యూటర్న్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు, మరి ఈ చిత్రం అయినా కమర్షియల్ సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.