Begin typing your search above and press return to search.
ఏపీలో తనకెదురైన కాస్ట్ ఫీలింగ్ అనుభవాన్ని పంచుకున్న అడివి శేష్..!
By: Tupaki Desk | 24 Jun 2022 4:30 PM GMTసమాజంలో కులం మతం అనేవి ఎంతటి ప్రభావం చూపిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వినటానికి వింతగా ఉన్నా.. ఇవి రెండూ మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ఒక నీడలా ఉంటాయి. కుల వ్యవస్థను నిర్మూలించాలని.. కుల రహిత సమాజం కోసం పోరాడాలని స్వాతంత్ర్యం రాకముందు నుంచే మన దేశంలో ఉద్యమాలు.. పోరాటాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కుల భావన ఎప్పటినుంచో ప్రబలంగా ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్ ప్రారంభంలో అలాంటివి ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్.. తనకు ఎదురైన కాస్ట్ ఫీలింగ్ సంఘటనను పంచుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అడివి శేష్ మాట్లాడుతూ.. 'కర్మ' సినిమా ప్రమోషన్ కోసం భీమవరం వెళ్లాం. అక్కడ ఒక స్థానిక వ్యక్తి 'కర్మ' ఆడియో సీడీపై నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను ఆ పోస్టర్ మీద కత్తి పట్టుకొని ఉంటాను. చాలా బాగుందని చెప్పాడు. 'మీకు ఏం కావాలో చెప్పండి.. ఎలా హెల్ప్ చేయాలో చెప్పండి' అన్నాడు. ఫస్ట్ టైం కలిసిన వెంటనే ఇంత బాగా హెల్ప్ చేస్తున్నాడు అని సంతోషించాను"
"ఆ తర్వాత నన్ను ఫ్యామిలీ విషయాలు అడగడం మొదలు పెట్టాడు. 'మా తాత అడివి గంగరాజు' అని చెప్పాను. అతను వెంటనే 'మీరు రాజులు కాదా?' అని అడిగాడు. ఆయన పోస్టర్ లో కత్తి ని చూసి నేను ఆ కాస్ట్ అని ఫిక్స్ అయ్యాడు. నేను కాదని చెప్పాను. నేను అతని కులం కాదని తెలిసి వెంటనే అతని స్వరం మారిపోయింది. అప్పటికే కమిట్ అయ్యాడు కాబట్టి 'సరే ఇంటర్వ్యూ కానివ్వండి' అన్నాడు" అని నవ్వుతూ చెప్పారు.
"అప్పటి వరకు నేను ఏ క్యాస్ట్ అనేది అసలు నా మైండ్ లోనే తట్టలేదు. నేను యూఎస్ లో ఇండియన్ అని చెప్పుకోవడమే గొప్ప. కానీ అప్పుడు ఫస్ట్ టైం నాకు క్యాస్ట్ గురించి తెలిసింది" అని శేష్ తెలిపారు. ఇదంతా నవ్వుతూ చెప్పడాన్ని బట్టి అతను ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఇండస్ట్రీలో అన్ని కులాల వారు.. బ్యాగ్రౌండ్ ఉన్నవారు కూడా తనని సపోర్ట్ చేసారని చెప్పుకొచ్చారు.
ఇకపోతే వర్సటైల్ హీరో అడివి శేష్ లేటెస్టుగా 'మేజర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న వేషాలతో అలరించిన శేష్.. ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'క్షణం' 'గూఢచారి' 'ఎవరు' వంటి సినిమాలు అతన్ని హీరోగా నిలబెట్టాయి. ఇప్పుడు 'మేజర్' తో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నారు.
ప్రస్తుతం 'గూఢచారి 2' మరియు 'హిట్ 2' సినిమాలతో పాటు మరో మూడు ప్రాజెక్టులు చేయవలసి ఉందని అడివి శేష్ వెల్లడించారు. ఈ ఐదు సినిమాలు కూడా విభిన్నమైన కంటెంట్ తో రూపొందనున్నాయని తెలిపారు.