Begin typing your search above and press return to search.

శేషుని థ్రిల్లింగ్ స్టార్ అంటే ఒప్పుకోవ‌డం లేదు!

By:  Tupaki Desk   |   24 May 2022 2:30 AM GMT
శేషుని థ్రిల్లింగ్ స్టార్ అంటే ఒప్పుకోవ‌డం లేదు!
X
మ‌న‌లో కంటెంట్ ఉంటే క‌టౌట్ తో ప‌నిలేదు. అంటే ప్రతిభ ఉంటే మిగ‌తా వాటితో ప‌నిలేదు. కేవ‌లం ట్యాలెంట్ మాత్ర‌మే ముందుకు తీసుకెళ్తుంది. ఆ త‌ర్వాత వ‌చ్చేవ‌న్ని త‌న పేరు త‌ర్వాతే ఉంటాయి గానీ..పేరు ముందు కాద‌ని స‌క్సెస్ అయిన వాళ్లంతా చెబుతుంటారు. నిజమే క‌దా! ట్యాలెంట్ ఉన్నోడికి మిగ‌తా వాటితో ప‌నేముంటుంది.

త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతే ఆ త‌ర్వాత వాటిక‌వే కాళ్ల ముందుకొస్తాయి. క‌ష్ట‌ప‌డే తత్వం.. శ్ర‌మించే గుణం ఉండాలే త‌ప్ప‌! ఒక మ‌నిషికి అంత‌కు మించి ఏం కావాలి. శివ శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గా వ‌చ్చిన చిరంజీవి అటుపై మెగాస్టార్ అయ్యారు. కొన్ని సినిమాల స‌క్సెస్ త‌ర్వాత చిరు కి మెగాస్టార్ అనే బిరుదు వ‌చ్చింది. సుప్ర‌సిద్ద ర‌చ‌యిత యండ‌మూరి విరేంద్ర‌నాధ్ బిరుదు చిరంజీవికి ఇచ్చారు.

దీని వెనుక చిరంజీవి కృషి ఎంతో ఉంది. అది స‌ప‌రేట్ టాపిక్ . ఇక బాల‌కృష్ణ ని న‌ట‌సింహంగా..వెంకటేష్ ని విక్ట‌రీ స్టార్... నాగార్జున‌ని కింగ్ గా.. మ‌హేష్ ని సూప‌ర్ స్టార్ గా..ప్రిన్స్ గా పిల‌చుకుంటాం. ఎన్టీఆర్ ని యంగ్ టైగ‌ర్ గా...ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ప‌వ‌ర్ స్టార్ గా ఇలా టాలీవుడ్ లో అగ్ర హీరోలంద‌రికీ పేర్లు ముందు బిరుదులుంటాయి.

సినిమా టైటిల్ ముందు వెడి తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటాయి. ఇప్పుడు బిరుదులు మ‌రీ కామ‌న్ గామారిపోయాయి. రెండు..మూడు సినిమాల‌కే హీరోలు పేర్లు ముందు ఫ‌లానా స్టార్ అంటూ త‌గ‌లించుకుంటున్నారు. బర్నింగ్ స్టార్...నైట్రో స్టార్ ఇలా. సాధార‌ణంగా బిరుదులు ప‌రిశ్ర‌మ గుర్తించి ఇస్తుంది. కానీ నేటి జ‌న‌రేష‌న్ లో త‌మ‌నితామే గుర్తుంచికుని బిరుదాంకితులు అవుతున్నారు.

అయితే ఇలాంటి బిరుదులు నాకొద్దు మ‌హాప్ర‌భో అంటున్నాడు యంగ్ హీరో అడ‌వి శేషు. ఇటీవ‌లి కాలంలో శేషు మంచి స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా విజ‌యాలు అందుకుంటున్నాడు. డిఫ‌రెంట్ కంటెంట్ తో స‌క్సెస్ లు అందుకుని న‌టుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. త్వర‌లో శేషు క‌థ‌నాయ‌కుడిగా న‌టిస్తున్న 'మేజ‌ర్' రిలీజ్ కానుంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ లో భాగంగా ఆన్ లైన్ చాట్ లో శేషుకి అభిమానులు థ్రిల్లింగ్ స్టార్ అనే బిరుదాంకితుడ్ని చేసే ప్ర‌య‌త్నం చేసారు. అయితే దానికి శేషు ఒప్పుకోలేదు. త‌న చిత్రాల్లో బ‌ల‌మైన కంటెంట్ ఉంటుంద‌ని.. అందువ‌ల్ల హీరోకి ట్యాగ్ లైన్ అవ‌స‌రం లేద‌ని తెలివిగా త‌ప్పించుకున్నాడు. అయితే దీనిపై భిన్న వాద‌న‌లొస్తున్నాయి.

అభిమానులు ఎంతో మెచ్చితే గానీ హీరోల‌కి బిరుదులు..ట్యాగ్ లైన్లు ఇవ్వ‌రు. ఆఛాన్స్ శేషుకి వ‌చ్చనా వినియోగించుకోలేదు. అభిమానుల నుంచి పుట్టిన బిరుదులు నిజంగా ఎంతో గొప్ప‌గానే భావించాలి. చిరంజీవి మెగాస్టార్ గా అలాగే బిరుదాంకితులు అయ్యారు.