Begin typing your search above and press return to search.

రెండు గంట‌ల్లోనే టిక్కెట్ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించిన శేషు!

By:  Tupaki Desk   |   31 May 2022 8:29 AM GMT
రెండు గంట‌ల్లోనే టిక్కెట్ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించిన శేషు!
X
యంగ్ హీరో అడ‌వి శేషు హీరోగా న‌టిస్తోన్న 'మేజ‌ర్' జూన్ 3న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్అ యిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెంచేసాయి. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ బ‌యోపిక్ కావ‌డంతోల రిలీజ్ కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. దేశ భ‌క్తుడు చిత్రం కావ‌డంతో టిక్కెట్ ధ‌ర‌లు పెంచ‌కుండా ఉన్న ధ‌ర‌ల్లోనే రిలీజ్ చేస్తున్నారు.

ఇలాంటి దేశ భ‌క్తుడి జీవిత క‌థ‌ని వీలైనంత మందికి తెలియ‌జేయాల‌నే ప్ర‌య‌త్నంలో భాగంగా టిక్కెట్ ధ‌ర‌లు పెంచలేదు. అయితే ఆర్టీస్ క్రాస్ రోడ్స్ సంధ్య 70 ఎంఎం లో బాల్క‌నీ టిక్కెట ధ‌ర‌ని 175 రూపాయ‌ల‌కు విక్ర‌యిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగింది. ఓ నెటి జ‌నుడు నేరుగా ఈ విష‌యాన్ని ట్వ‌ట‌ర్ ద్వారా అడ‌వి శేషు ముందుకు తీసుకెళ్లాడు.

దీంతో శేషు వెంట‌నే స్పందించి థియేట‌ర్ యాజ‌మాన్యంతో చ‌ర్చించి టిక్కెట్ ధ‌ర స‌మ‌స్య‌ని రెండు గంట‌ల్లోనే ప‌రిష్‌క‌రించారు. ఈ విష‌యాన్ని శేషు ట్వీట్ చేసి చెప్పారు. 'నేను సంధ్య థియేట‌ర్ యాజ‌మాన్యాన్ని అభ్య‌ర్ధించాను. వారు స‌హ‌క‌రించినందుకు ధ‌న్య‌వాద‌ములు. మేజ‌ర్ చిత్రాన్ని అంద‌రికీ అందుబాటులో ఉండేలా అంతా నిర్ణ‌యించాం. ఆ దిశ‌గానే ముందుకు వెళ్తాం' అని తెలిపారు.

దీంతో 'మేజ‌ర్' కూడా 'ఎఫ్ -3' బాట‌లోనే యాధివిధిగా రిలీజ్ అవుతుంద‌ని తెలుస్తుంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన ఎఫ్ -3 మంచి స‌క్సెస్ దిశ‌గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. టిక్కెట్ ధ‌ర‌లు త‌క్కువ‌గానే వ‌సూళ్ల ప‌రంగా బాక్సాఫీస‌క ని షేక్ చే స్తుంది. సినిమాలో విష‌యం ఉంటే టిక్కెట్ ధ‌ర‌లతో సంబంధం ఎంటి? ఒక‌రోజులో రావాల్సిన వ‌సూళ్లు రెండు రోజుల్లో వ‌స్తాయి? అంత‌కు మించి తేడా ఏముంటుంద‌ని చెప్ప‌క‌నే చెబుతుంది.

'మేజ‌ర్' పైనా టీమ్ అంతా ధీమాగా ఉంది. సినిమా నిర్మాణానికి భారీగానే ఖర్చు చేసారు. ఈ సినిమా నిర్మాణంలో అనురాగ్ రెడ్డి..శ‌ర‌త్ చంద్ర‌తో పాటు సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా నిర్మాణంలో భాగ‌మైన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఎంట్రీ తో సినిమా స్థాయే మారిపోయింది.

ఇటీవ‌లే సినిమా ప్ర‌మోష‌న్ లో పాల్గొన్న మ‌హేష్ మేజ‌ర్ పై ప్ర‌శంసలు కురిపించిన ఈ సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని శిషి కిర‌ణ్ తిక్క తెర‌కెక్కించారు. దాదాపు 30 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. అడ‌వి శేషు క్రేజ్ నేప‌థ్యంలో సినిమాకి మంచి బిజినెస్ జ‌రిగింది. డిజిటల్ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయాయి.