Begin typing your search above and press return to search.
అడివి శేష్.. కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా?
By: Tupaki Desk | 23 May 2022 11:30 AM GMTక్షణం, గూఢచారి, ఎవరు.. ఈ మూడు చిత్రాలతో అడివి శేష్‌కు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఈ మూడూ ప్రేక్షకులను అమితాశ్చర్యానికి గురి చేసి ఉత్కంఠతో ఊపేశాయి. శేష్ సినిమా అంటే ఆషామాషీగా ఉండదు అనే నమ్మకాన్ని కలిగించాయి. ఐతే తన కొత్త సినిమా 'మేజర్' గురించి ఇటీవల ట్విట్టర్లో నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ.. పై మూడు చిత్రాల కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు శేష్. పై సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుంది అంటే ఒక లెక్క.
కానీ వాటికి నాలుగు రెట్లు అనడం చిన్న విషయం కాదు. తన సినిమాల గురించి శేష్ మామూలుగా మరీ ఎక్కువ చేసి చెప్పుకోడు. అతడి మాటలు కోటలు దాటవు. కానీ 'మేజర్' మీద అతడి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు.
జూన్ 3న హిందీలో 'పృథ్వీరాజ్', తమిళంలో 'విక్రమ్' లాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి కదా అంటే.. అవి బిగ్ ఫిష్‌లు అయితే, తమది 'గోల్డ్ ఫిష్'లు అని పేర్కొనడం కూడా శేష్‌కు తమ చిత్రంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
ఐతే సినిమాపై కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే. కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితేనే ప్రమాదం. 'మేజర్' సినిమా ప్రోమోలు ఏవి చూసినా పాజిటివ్ ఫీల్ కలుగుతోంది. ట్రైలర్ చూస్తే ఇది స్యూర్ షాట్ హిట్ లాగే అనిపించింది. అలాగని ప్రేక్షకుల్లో మరీ ఎక్కువ అంచనాలను పెంచితే, కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ప్రమాదమే.
ట్రైలర్లతో అద్భుతంగా అనిపించి, కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతాయనుకున్న సినిమాలు కూడా నిరాశ పరిచిన దాఖలాలు లేకపోలేదు. ముంబయి తాజ్ హోటల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథలోనే ఎంతో ఎమోషన్ ఉంది కాబట్టి సినిమా ప్రేక్షకులను కచ్చితంగా కదిలిస్తుందని శేష్ బృందం భావిస్తుండొచ్చు.
కానీ ఆ కథను ఎగ్జాజరేషన్ అనిపించకుండా.. ప్రేక్షకులను సరిగ్గా కనెక్ట్ అయ్యేలా చెప్పారా అన్నది కీలకం. ఇదిలా ఉంటే.. విడుదలకు 10 రోజుల ముందే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో స్పెషల్ షోలు వేసేస్తున్నారు. రిలీజ్‌కు ఒకట్రెండు రోజుల ముందు ప్రిమియర్స్ వేయడం మామూలే కానీ.. మరీ పది రోజుల ముందు ఇలా షోలు వేయడం కూడా సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం కావచ్చు. కానీ ఏ రకంగా అయినా సినిమా అంచనాలకు తగ్గితే.. వచ్చే టాక్ వల్ల సినిమాకు చేటు జరిగే ప్రమాదం ఉంది. అలా జరగకూడదని ఆశిద్దాం.