Begin typing your search above and press return to search.
'మేజర్' ప్రతి మనిషికి నచ్చే మూవీ: హీరో అడవిశేష్
By: Tupaki Desk | 12 April 2021 4:49 PM GMTప్రస్తుతం చిత్రపరిశ్రమలో బయోపిక్స్ కాలం నడుస్తుంది. అందులో భాగంగానే ఇండియాలో ఫేమస్ పర్సనాలిటీల లైఫ్ స్టోరీలను సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ యువహీరో అడవిశేష్ ప్రస్తుతం 'మేజర్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మేజర్ మూవీ జులై 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఉగాది స్పెషల్ కావడంతో తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. కానీ మేజర్ టీజర్ మూడు భాషల్లో ముగ్గురు సూపర్ స్టార్స్ రిలీజ్ చేయడం విశేషం. ప్రస్తుతం మేజర్ టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా సినిమా గురించి ఒక్కొక్కరుగా మాట్లాడారు.
దర్శకుడు శశికిరణ్ మాట్లాడుతూ.. మేజర్ జర్నీ శేష్ నుండే స్టార్ట్ అయ్యింది. నన్ను ఈ ప్రాజెక్ట్‌లోకి శేష్ తీసుకొచ్చాడు. మొదట్లో ఈ మూవీ చేయొద్దనుకున్నా. కాని శేష్ సందీప్ గురించి చెప్పినప్పుడు, తర్వాత వారి తల్లిదండ్రులను వెళ్లి కలిసినప్పుడు ఇది చెప్పకపోతే తప్పు అవుతుందని భావించాను. సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం నన్ను నన్ను కదిలించిన, ఇన్స్‌పైర్ చేసిన విధానం ఈ సినిమాతో రెండేళ్లు జర్నీ చేయించింది. నా లైఫ్ లాంగ్ ఈ మూవీ గురించి చాలా గర్వంగా చెప్పుకుంటాను అన్నాడు. అనంతరం హీరోయిన్ సాయి మంజ్రేకర్.. 'ఈ మూవీ షూటింగ్ చాలా ఫన్నీగా జరిగింది. ఈ సినిమా నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మా పేరెంట్స్ తప్పకుండా చేయాలని చెప్పారు. వాళ్ల సపోర్ట్ తోనే ఈ మూవీ చేయగలిగాను. ఈ మూవీ ఒక గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్' అని చెప్పింది.
మరో హీరోయిన్ శోభిత మాట్లాడి.. ఈ టీమ్ తో గూడఛారి మూవీ షూట్ చేశా. అందుకే ఈ టీమ్‌తో మంచి బంధం ఏర్పడింది. మేజర్ మూవీలో భాగమవడం చాలా గర్వంగా ఉందంది. అలాగే నిర్మాత శరత్.. ఇది ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ మూవీ. మాకు సపోర్ట్ చేసిన నమ్రత మేడమ్, మహేష్ సర్‌కి థ్యాంక్స్. అలాగే సోనీ పిక్చర్స్ వారు మాతో భాగస్వామ్యం అవడం హ్యాపిగా ఉందన్నారు. మరో నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన నమ్రత, మహేష్‌బాబు గారికి ధన్యవాదాలు. సోనీ పిక్చర్స్ వారు ఎన్నో భాషలలో సినిమాలు చేశారు. శేష్‌కి థ్యాంక్స్. శశి చాలా బ్యాటిఫుల్‌గా ఈ మూవీని తెరకెక్కించారని అన్నారు.
చివరిగా అడివిశేష్ మాట్లాడుతూ.. 2008 ముంబై ఎటాక్స్ సమయంలో నేను యూఎస్‌లో ఉన్నాను. సందీప్ ఫోటో చూసినప్పుడు నాకు అన్నయ్యలా ఉన్నారనుకున్నా. ఓన్ బ్రదర్ ను కోల్పోయాం అనే ఫీలింగ్ వచ్చింది. మేజర్ సందీప్ స్టోరీ ఓకే అనుకున్నాక మా ఫస్ట్ ఛాలెంజ్ సందీప్ పేరెంట్స్. కేవలం కమర్షియల్‌గా కాకుండా జెన్యూన్‌గా చేద్దామని కష్టపడి ఒప్పించాం. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయగానే మేజర్ సందీప్ గారి మ్యూజియంలో యూనిఫామ్ లే అవుట్ తో పోస్టర్ రిలీజ్ చేశాం. మనస్పూర్తిగా చేసిన మూవీ కాబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి.
కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్ నన్ను అడిగారు ఇది ఏ సెంటర్ ఫిలిమా? లేదా బీసి సెంటర్స్ సినిమానా? అని.. వారందరికీ చెప్పేదొక్కటే. ఇది మనిషికి నచ్చే ఫిల్మ్. మనిషిలోని ప్రతి ఫీలింగ్‌ని చూపించే చిత్రమిది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క సోల్‌ని సంగ్రహించి చేయడమే మా ఉద్దేశ్యం. ఈ సినిమా టీజర్ ని మూడు భాషల్లో ముగ్గరు హ్యూజ్ స్టార్స్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. టీజర్స్ లాంచ్ చేసిన సల్మాన్‌ఖాన్ గారికి, పృథ్విరాజ్ గారికి థ్యాంక్స్. మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ కి పూర్తి సపోర్ట్ అందించిన నమ్రత మేడమ్, మహేష్ సర్‌కి స్పెషల్ థ్యాంక్స్. వారి గైడెన్స్ ఎప్పటికీ మేం మర్చిపోలేము. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ కి ధన్యవాదాలు" అని చెప్పుకొచ్చాడు.