Begin typing your search above and press return to search.

ఎడ్జస్టుమెంటు సరే.. కంటెంట్‌ ఉందా?

By:  Tupaki Desk   |   16 Nov 2015 5:30 PM GMT
ఎడ్జస్టుమెంటు సరే.. కంటెంట్‌ ఉందా?
X
నవంబర్‌ నెలాఖరున వస్తున్నాం అని చాలా కాలంగా తెగ ప్రమోట్‌ చేసుకుంటున్న మాస్‌ రాజా ''బెంగాళ్‌ టైగర్‌'' ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. దానికి కారణం ఏంటంటే.. సైజ్‌ జీరో.. శంకరాభరణం.. వంటి చిన్న సినిమాలకు స్పేస్‌ ఇస్తే మంచిదని ఆ సినిమా నిర్మాత తలిచారట. అందుకే సైజ్‌ జీరోను నవంబర్‌ 27న శంకరాభరణం ను డిసెంబర్‌ 4న.. అలాగే బెంగాళ్‌ టైగర్‌ ను డిసెంబర్‌ 10న విడుదల చేయడానికి ప్లాన్‌ చేసుకున్నాం అంటున్నారు నిర్మాత పివిపి. బాగానే ఉంది.

అసలు ఇలాంటి ఎడ్జస్టుమెంటులు ఎందుకు చేస్తారంటే.. ఒకవేళ శ్రీమంతుడు మహేష్‌ కనుక బాహుబలి కోసం గ్యాప్‌ ఇవ్వకపోతే.. ఖచ్చితంగా బాహుబలి రెవిన్యూ కాస్త తగ్గుండేదే. అలాగే మహేష్‌ కూడా కాస్త నష్టపోయేవాడు. అవన్నీ భారీ బడ్జెట్‌ సినిమాలు కాబట్టి అలాంటి ఎడ్జస్టమెంట్లు తప్పవు. కాని అనుష్క - నిఖిల్‌ వంటి చిన్న చిన్న మార్కెట్లు ఉన్న లీడ్‌ స్టార్లకు కూడా ఇప్పుడు ఎడ్జస్టమెంట్లంటే.. అసలు కంటెంట్‌ మీద వీళ్ళకు నమ్మకం లేదేమో అని కూడా అనుకుంటున్నారు జనాలు. లేకపోతే ఒకేరోజు రెండు సినిమాలు వస్తే నష్టమేముంది? కంచె - రాజుగారి గది - కొలంబస్‌ సినిమాలో ఒకేరోజు రాగా.. బాగున్న సినిమాలకు వాళ్లు ప్లాన్‌ చేసుకున్నట్లే వసూళ్లు రాలేదటండీ.

ఇదంతా ఒకెత్తయితే.. అసలు ఇలా వారానికి ఒకటే సినిమా అంటే మాత్రం సంవత్సరానికి కేవలం 54 సినిమాలే వస్తాయ్‌ మరి. ఈ ఎడ్జస్టుమెంటులు తెలుగు సినిమా పరిశ్రమను లాభాల దిక్కులో నడిపిస్తాయో లేకపోతే నష్టాలు పాలు చేస్తాయో ఇక మీరే ఆలోచించుకోండి. కావల్సినన్ని ధియేటర్లు ఉండగా.. అసలు ఈ ఎడ్జస్టుమెంటులు ఎందుకని జనాలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు.