Begin typing your search above and press return to search.
ఇక సింగర్ అద్నాన్ సమి మనోడే
By: Tupaki Desk | 31 Dec 2015 11:41 AM GMTవచ్చిందా మేఘం రాని.. అంటూ పాడినా.. నచ్చావే నైజాం పోరీ.. అంటూ పాడినా.. అది పాకిస్తానీ సింగర్ అద్నాన్ సమీకే చెల్లింది. మనోడు అక్కడి నుండి ఇక్కడికి లిఫ్ట్ కరాదే అంటూ వచ్చేసి.. ఇప్పుడు ఇక్కడే పాగా వేశాడు. అంతేకాదు.. ముంబయ్ నా సొంత నగరం.. ఆ నగరానికి ఏం జరిగినా నేను హర్టవుతాను.
ఇకపోతే అద్నాన్ సమీ ఇక భారతీయుడు కానున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతీయ పౌరసత్వం ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. జనవరి 1 నుంచి ఆయన అధికారికంగా భారతీయ పౌరుడిగా కొనసాగుతారని తెలిపింది. పాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన అద్నాన్ తొలిసారి 2001 - మార్చి 13న విసిటర్ వీసాపై భారత్ లో అడుగుపెట్టాడు. అప్పుడు ఇస్లామాబాద్ లోని భారతీయ హైకమిషన్ ఈ వీసాను మంజూరు చేసింది. కానీ, పాకిస్థాన్ మాత్రం ఆయనకు పాస్ పోర్టును 2010 మే 27న ఇవ్వగా దానికి 2015, మే 6తో కాలపరిమితి ముగిసింది. తిరిగి పాస్ పోర్టును ఆయన రెనివల్ కూడా చేసుకోలేదు. ఆ తర్వాత మానవత దృక్పథంతో ఆలోచించి తనకు భారత్ లోనే చట్టబద్దంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమోదం లభించింది.
సో ఇక నుండి ఈ మాంత్రిక సింగర్ మనోడే!!