Begin typing your search above and press return to search.

ఇండియా చేరిన స్టార్ హీరో అండ్ టీమ్!

By:  Tupaki Desk   |   22 May 2020 10:50 AM GMT
ఇండియా చేరిన స్టార్ హీరో అండ్ టీమ్!
X
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ‘ఆడుజీవితం’ చిత్ర యూనిట్.. షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లి రెండు నెలలకు పైగా అక్కడే చిక్కుకుపోయి మొత్తానికి స్వదేశానికి సురక్షితంగా చేరుకున్నారు. కరోనా కారణంగా జోర్డాన్‌లో ఇరుక్కుపోయిన ‘ఆడుజీవితం’ చిత్రయూనిట్ సభ్యులు మొత్తం 58మంది ‘వందే భారత్ మిషన్’ సహాయంతో భారత దేశానికి ఢిల్లీ మీదుగా కేరళలోని కొచ్చి విమాశ్రయానికి చేరుకున్నారు. భర్త సురక్షితంగా తిరిగి రావడం పట్ల పృథ్వీరాజ్ భార్య సుప్రియా మీనన్ భావోద్వేగానికి గురై.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్వేగపూరిత పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో.. ‘‘దాదాపు రెండు నెలల తర్వాత పృథ్వీరాజ్, ఆయన చిత్ర బృందం కేరళ చేరుకున్నారు. నిబంధనల ప్రకారం.. వారంతా క్వారంటైన్‌కు వెళ్తున్నారు. వారికోసం ఎంతగానో వేచి చూసాం. వారంతా సురక్షితంగా ఇళ్లకు తిరిగి రావడానికి సహకరించిన అధికారులకు.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇలాంటి బరువైన సమయంలో మాకోసం ప్రార్థించి - మాలో ఆత్మ స్థైర్యాన్ని నింపిన అభిమానులకు - శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు.

నాన్న తిరిగి వచ్చినందుకు కూతురు అలంకృత మీనన్ చాలా ఆనందంగా ఉంది. మరో రెండు వారాలలో నాన్నను చూస్తుందని ఆశిస్తున్నాను’’ అంటూ సుప్రియా మీనన్ తెలిపారు. వీలు కాక‌పోవ‌డంతో బ్లెస్సీ, పృథ్వీరాజ్ కేర‌ళ సీఎంకి కూడా లేఖ రాసారు.ఎలాగైనా మాకు సహాయపడాలని దర్శకుడు బ్లెస్సీ కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశాడు. అన్న‌పానీయాలు సైతం అందుబాటులో ఉండ‌ట్లేద‌ని, కేర‌ళ‌కు తిరిగి వ‌ద్దామ‌న్నా విమానాల రాక‌పోక‌లు స్థంభించిపోయాయ‌ని పేర్కొన్నాడు. ప్ర‌భుత్వ సాయం లేనిదే కేర‌ళ‌కు రావ‌డం దాదాపు అసాధ్య‌మ‌ని వాపోయాడు. మా స‌మస్య‌కు ప్ర‌భుత్వ‌మే ప‌రిష్కారం చూపాల‌ని లేఖ‌లో అభ్య‌ర్థించాడు. మ‌రోవైపు పృథ్వీరాజ్ కూడా ఇదే విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌ లో ప్ర‌స్తావించాడు. ప్రస్తుతం వారు ఇండియాకి చేరడంతో అభిమానులు - కుటుంబ స‌భ్యులు - స‌న్నిహితులు - శ్రేయోభిలాషులు సంతోషం వ్య‌క్తం చేశారు.