Begin typing your search above and press return to search.
పిచ్చి పీక్స్ కు చేరింది
By: Tupaki Desk | 17 Jan 2018 4:49 AM GMTఎవరైనా నిస్సందేహంగా ఒప్పుకోవాల్సిందే రామ్ గోపాల్ వర్మ ప్రతిభావంతుడైన దర్శకుడని. కానీ ఆ దర్శకత్వ ప్రతిభ ఏదో దారి తప్పినట్టు కనిపిస్తోంది. ఈమధ్య డైరెక్ట్ చేసిన సినిమాలేవీ బాక్సాఫీసును ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయి. దీంతో తనకు అలవాటైన మాఫియా స్టోరీలో సెక్సువల్ కంటెంట్ నింపి గన్స్ అండ్ థైస్ ప్లాన్ చేశాడు. ఇంతలో ఏకంగా పచ్చిగా శృంగార సినిమాల్లో నటించే పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో పచ్చి నిజాలు చెప్పిస్తున్నానంటూ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పేరుతో ఓ సినిమా లాంటి డాక్యుమెంటరీ తీశాడు.
తాను తీసిన ఈ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ను తనదైన స్టయిల్లో ప్రమోట్ చేయడం మొదలెట్టాడు వర్మ. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశాడు. ఎంతకాదన్నా వర్మ పాపులర్ డైరెక్టర్. సోషల్ మీడియాలో అతడిని ఫాలో అయ్యేవాళ్లు చాలామందే ఉంటారు. ఆర్జీవీ ఫీలయ్యింది ప్రతి ఒక్కరూ ఫీలవ్వాలని లేదుకదా.. అదేం పట్టించుకోకుండా తన సోషల్ మీడియా పేజీని ఓ అడల్ట్ వెబ్ సైట్ లా తయారు చేశాడు.
ఆర్జీవీ పెట్టిన చూసిన నెటిజన్లు కొందరు తప్పు పడుతుండగా.. ఇంకొందరు మాత్రం శివ.. రంగీలా.. సత్యలాంటి సినిమాలు తీసిన దర్శకుడా ఇలాంటి సినిమాలు తీస్తున్నాడంటూ ఒకింత నిట్టూర్చారు. ఇంకొందరైతే కచ్చితంగా పోర్న్ సినిమా డైరెక్ట్ చేసే అవకాశమొస్తుందంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. అయినా సోషల్ మీడియాలో సెక్స్ సినిమా గురించి పబ్లిసిటీ చేయడం ఏమిటి.. పైత్యం ప్రకోపించడం కాకపోతే అని అంటున్నారు ?