Begin typing your search above and press return to search.
అడ్వాన్స్ బుకింగ్ లో పై చేయి..!
By: Tupaki Desk | 10 Aug 2022 12:30 PM GMTబాలీవుడ్ లో రెండు పెద్ద సినిమాలు ఈ వారం బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ సినిమాలకు గడ్డు పరిస్థితి నడుస్తుంది. ఈ సమయంలో రెండు పెద్ద సినిమాలు ఒకే వారంలో రావడం అనేది ఖచ్చితంగా పెద్ద క్ల్యాష్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు సినిమాలకు కూడా వసూళ్ల పరంగా నష్టం తప్పక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రెండు సినిమాల్లో ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 4 వేల స్క్రీన్స్ లో విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక మరో వైపు అక్షయ్ కుమార్ నటించిన 'రక్షాబంధన్' సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా 4.2 వేల స్క్రీన్స్ ల్లో స్క్రీనింగ్ చేసేందుకు గాను ఏర్పాట్లు జరిగాయి అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ రెండు సినిమాల్లో రక్షా బంధన్ ను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. లాల్ సింగ్ చడ్డా సినిమా లో ఆమీర్ ఖాన్ ఉండటం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అక్షయ్ కుమార్ సినిమా లు బ్యాక్ టు బ్యాక్ వచ్చి అప్పుడప్పుడు సక్సెస్ లు పడుతున్నాయి. ఆమీర్ ఖాన్ గత చిత్రం వచ్చి చాలా కాలం అయ్యింది. ఆయన చివరి సినిమా కూడా ప్లాప్ అందువల్ల కాస్త లాల్ సింగ్ చడ్డా విషయంలో అనుమానలు ఉన్నాయి.
ఇప్పుడు ఆ అనుమానాలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అంటున్నారు. లాల్ సింగ్ చడ్డా సినిమా తో పాటు రక్షాబంధన్ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ లు మొదలు అయ్యాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం లాల్ సింగ్ చడ్డా యొక్క వసూళ్లు దాదాపుగా రెట్టింపు ఉన్నాయి. అక్షయ్ కుమార్ సినిమా కంటే ఆమీర్ ఖాన్ సినిమా ను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
లాల్ సింగ్ చడ్డా సినిమా కు తాజా సమాచారం అందేప్పటికి దాదాపుగా రూ.13 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ అయ్యిందని తెలుస్తోంది. ఇక రక్షాబంధన్ సినిమా కేవలం 6.2 కోట్ల రూపాయలను మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టినట్లుగా తెలుస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్ లో లాల్ సింగ్ చడ్డా పై చేయి సాధించింది. కాస్త పాజిటివ్ టాక్ ను దక్కించుకుంటే కచ్చితంగా అక్షయ్ కుమార్ సినిమా కనిపించే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.