Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కోసం తమిళ డైరెక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చారా?
By: Tupaki Desk | 9 Feb 2023 5:31 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి నటించిన పాన్ ఇండియా వండర్ `RRR`. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా రికార్డులతో పాటు రివార్డుల్ని, అవార్డుల్ని అందిస్తూ ఆస్కార్ దిశగా దూసుకుపోయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై పలు ప్రతిష్టాత్మక పురస్కారాల్ని దక్కించుకున్న `RRR` హాలీవుడ్ స్టార్స్ అత్యంత ప్రెస్టీజియస్ గా భావించే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని నాటు నాటు సాంగ్ కు గానూ సొంతం చేసుకోవడం తెలిసిందే.
ప్రస్తుతం ఆస్కార్ అకాడమీ అవార్డుల కోసం ఫైనల్ రేసులోకి దిగి ఆస్కార్ కు అడుగు దూరంలో వుంది. ఈ నేఫథ్యంలో ఈ మూవీ సాధిస్తున్న అవార్డుల ఆనందక్షణాలని ఆస్వాదిస్తూనే ఆస్కార్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఇదే జోష్ తో త్వరలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 20న లాంఛనంగా ఫార్మల్ పూజతో సినిమాని ప్రారంభించి మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఆశగా ఎన్టీఆర్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేఫథ్యంలో తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడంటూ ఓ వార్తల ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా ఈ మూవీ కోసం దర్శకుడు వెట్రిమారన్ కు మైత్రీ మూవీ మేకర్స్ వారు 5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారని, ఎన్టీఆర్ తో పాటు ఈ మూవీలో మరో తమిళ హీరో కూడా నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా మల్టీస్టారర్ గా తెరపైకి రానుందని, 2025లో ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టే అవకాశం వుందని తమిళ మీడియాలో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తమిళ ప్రేక్షకులు, అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై అమితాసక్తిని ప్రదర్శించడం విశేషం. తెలుగు సినిమాలంటే నెట్టింట ట్రోల్ చేస్తూ వాదనకు దిగే తమిళ ప్రేక్షకులు తొలిసారి ఎన్టీఆర్ తో వెట్రి మారన్ సినిమా అనగానే నెట్టింట ఈ ప్రాజెక్ట్ పై తమ ఆసక్తిని ప్రదర్శిస్తూ ట్వీట్ లు చేస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా ఇదొక హ్యూజ్ ప్రాజెక్ట్ అవుతుందని అప్పుడే భారీ లెక్కలు కూడా వేస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ తో పాటు ధనుష్ కూడా నటిస్తాడని చెబుతున్నారు. కారణం ఏంటంటే వెట్రిమారన్ సినిమాల్లో అత్యధిక శాతం ధనుష్ నటించాడు. ఆ కారణంగానే ధనుష్ ఈ మల్టీస్టారర్ లో నటించే అవకాశం వుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తరువాతే ఈ సినిమా వుంటుందని తమిళ మీడియా చెబుతోంది. తమిళంలో దర్శకుడు వెట్రిమారన్ కు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. `పొల్లాదవన్`, ఆడు కాలం, విచారణై, వడా చెన్నై, అసురన్ వంటి సినిమాలతో ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆడు కాలం కు రెండు, కాక ముట్టైకి ఒకటి, విచారణై కి ఒకటి, అసురన్ కు మరొకటి ఇలా మొత్తం నాలుగు జాతీయ సురస్కారాల్ని సొంతం చేసుకున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.