Begin typing your search above and press return to search.

మనసుకిదే మంచి ఛాన్స్

By:  Tupaki Desk   |   19 Dec 2018 10:40 AM GMT
మనసుకిదే మంచి ఛాన్స్
X
ఎల్లుండి టాలీవుడ్ లో కొత్త సినిమాల సందడి మాములుగా ఉండేలా లేదు. ఒకటికి నాలుగు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ బాద్షా మూవీ కూడా రంగంలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే దేనికవే ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేనివి కావడం ప్రధానమైన విశేషం. దేనికి ఎక్కువ వెయిట్ ఉందనేది పక్కన పెడితే ఓపెనింగ్స్ కు చాలా కీలకంగా భావించే యూత్ ని ఆకట్టుకునే మూవీస్ లో పడి పడి లేచే మనసు ముందు వరసలో ఉందన్నది నిజం. ఒకవేళ కంటెంట్ కనక వాళ్ళను మెప్పించేలా ఉంటే త్వరగా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

వరుణ్ తేజ్ అంతరిక్షం ధీటైన పోటీ ఇస్తున్నప్పటికీ ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని స్పేస్ జానర్ కాబట్టి మౌత్ టాక్ బయటికి వచ్చి పాజిటివ్ గా ఉందనే మాట వచ్చాక ఆటోమేటిక్ గా పికప్ అవుతుంది. అయితే ఇది లవ్ స్టోరీ కాకపోవడం కొంత మేర ప్రభావం చూపించినా ఘాజీ తరహాలో అంతకు మించి ఎంగేజింగ్ గా ఉంటే వరుణ్ తేజ్ కి హ్యాట్రిక్ పడ్డట్టే. కానీ దీనికి లేని ప్లస్సులు మొదటి రోజు పడి పడి లేచే మనసుకు కొన్ని ఉన్నాయి. సాయి పల్లవి బ్రాండ్ బాగా పని చేస్తోంది. పైగా ప్రమోషన్స్ లో చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ అనే ఫీలింగ్ కలిగించడంలో యూనిట్ సక్సెస్ కావడంతో దానికి తగ్గట్టే బుకింగ్స్ విషయంలో ఓ అడుగు ముందుంది. మల్టీ ప్లెక్సుల్లో శర్వా మూవీనే ముందు ఫుల్ అవుతుండటం గమనార్హం.

ఇక కెజిఎఫ్ సందడి కొంచెం కూడా లేదు. ఆడుతుందన్న ధీమానో లేక తెలుగు మార్కెట్ పెద్దగా అవసరం లేదనుకున్నారో కానీ పరిచయం లేని యష్ సినిమా మీద పబ్లిక్ లో ఏమంత ఆసక్తి లేదు. ధనుష్ మారి 2 పరిస్థితి దీనికి భిన్నంగా ఏమి లేదు. షారుఖ్ ఖాన్ జీరో ఏ సెంటర్స్ లో కాస్త ఎఫెక్ట్ చూపించినా మిగిలిన చోట్ల అంత రచ్చ చేసే సీన్ ఉండదు. సో పడి పడి లేస్తున్న మనసు ఎంత వరకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోందో వేచి చూడాలి.