Begin typing your search above and press return to search.
మహానుభావా.. మాంచి టైం దొరికిందయ్యా
By: Tupaki Desk | 28 Sep 2017 5:46 AM GMTఈ దసరాకు సినిమాల రేస్ పీక్స్ లో ఉంటుందనే విషయం ముందే ఖాయమైంది. పండగ రోజులు ప్రారంభంలోనే ఎన్టీఆర్ జై లవకుశ.. మధ్యలో మహేష్ బాబు మూవీ స్పైడర్.. ఫినిషింగ్ లో శర్వానంద్ మహానుభావుడు రిలీజ్ ఫిక్స్ అయి.. అందుకు తగినట్లుగా థియేటర్ల పంపకాలు కూడా జరిగిపోయాయి.
అయితే.. రెండు భారీ చిత్రాల మధ్య చిన్న సినిమా మహానుభావుడు నలిగిపోతుందేమో అని అంతా భావించారు. కానీ ఈ చిత్రానికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ బాగుంది. డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఇండస్ట్రీలో పేరు మోసిన దిగ్గజాలే కావడంతో.. థియేటర్స్ కౌంట్ విషయంలో కూడా ఏ మాత్రం తక్కువ జరగలేదు. ఇప్పుడు అదే శర్వానంద్ కు కలిసొచ్చే పాయింట్ కాబోతోంది. పైగా జై లవకుశ చిత్రానికి క్రిటిక్స్ రేటింగ్ తక్కువగానే ఉందని ఎన్టీఆర్ స్వయంగా చెప్పడమే కాకుండా.. ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న పేషెంట్ తో సినిమాను పోల్చాడు. అఫ్ కోర్స్.. ఎన్టీఆర్ చెప్పిన మాట అన్ని సినిమాల గురించి అయినా.. చాలామంది ఆ పాయింట్ ను మిస్ చేసి.. జైలవకుశకు అంటగట్టేస్తున్నారు.
మరోవైపు రీసెంట్ రిలీజ్ స్పైడర్ కు కూడా రేటింగులు తక్కువగానే పడ్డాయి. మౌత్ టాక్ విషయంలో ఫ్యాన్స్ నుంచి కూడా అంత పాజిటివ్ రియాక్షన్ లేదు. మహేష్ కు సౌత్ హీరోగా ఎదిగే మంచి ఛాన్స్ ను మిస్ చేశాడని ముురగదాస్ పై మండిపడుతున్నారు కూడా. ఇవన్నీ కలిసి.. మారుతి-శర్వానంద్ ల మహానుభావుడికి అడ్వాంటేజ్ కానున్నాయి. మహానుభావుడు ఏ రకంగానూ ఈ సినిమాలకు పోటీ కాదు.
ఫ్యామిలీ.. ఫన్ జోనర్ లో ఉండే ఆ చిత్రానికి.. స్పెషల్ ఆడియన్స్ ఉంటారు. కంటెంట్ బాగుందనే టాక్ కొంచెం వచ్చినా.. ఫ్యామిలీ ఆడియన్స్ తండోపతండాలుగా వచ్చేస్తారని.. శతమానం భవతి లాంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. మొత్తానికి అనుకోకుండానే మహానుభావుడికి లక్కీగా సూపర్బ్ టైం దొరికేసింది.