Begin typing your search above and press return to search.

రారండోయ్ కు రాసిచ్చేశారంతే!!

By:  Tupaki Desk   |   2 Jun 2017 1:25 PM GMT
రారండోయ్ కు రాసిచ్చేశారంతే!!
X
ఈ శుక్రవారం రిలీజయ్యే సినిమా రిజల్టును బట్టి.. గత శుక్రవారం వచ్చిన సినిమా గమ్యం ఎలా ఉండబోతుందో ఎలా మారబోతుందో మనం చెప్పుకోవచ్చు. అయితే గత శుక్రవారం వచ్చిన ''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమా కాస్తంత యావరేజ్ టాక్ తో సతమతమవుతోంది. అలాంటప్పుడు ఈ శుక్రవారం వచ్చిన సినిమాలు పెద్ద హిట్లు కొడితే.. నాగచైతన్య వేడుక త్వరగా ముగించాల్సి వచ్చేది. కాని కొత్త పెళ్ళికొడుకు కాబోతున్న ఈ అక్కినేని హీరోకు కాలం కలిసొచ్చిందిలే.

అదిగో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాకు పోటీగా ఇప్పుడు రాజ్ తరుణ్‌ చేసిన 'అంధగాడు'.. అలాగే రాజ్ తరుణ్‌ వదిలేస్తే సుమంత్ అశ్విన్ చేసిన 'ప్యాసన్ డిజైనర్' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో ఏది నిలబడినా కూడా రారండోయ్ కలక్షన్లకు గండికొట్టేసినట్లే. అయితే ఇప్పుడు సీన్ చూస్తుంటే రారండోయ్ పిచ్చ సేఫ్‌ లో ఉందనిపిస్తోంది. అంధగాడు సినిమా ఫస్టాఫ్‌ ఓకె కాని సెకండాఫ్‌ బ్యాడ్ అంటూ టాకొచ్చేసింది. అలాగే ఫ్యాషన్ ఎలియాస్ ప్యాసన్ డిజైనర్ కూడా పాటల్లో తప్పిస్తే సీన్లలో మ్యాటర్ లేదనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే చక్కగా బాక్సాఫీస్ దున్నుకోమని రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు ఇంకో రెండు వారాలు రాసిచ్చేసినట్లే అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇకపోతే బాహుబలి 2 సినిమా ప్రభంజనాన్ని శర్వానంద్.. నాగ చైతన్య.. రాజ్ తరుణ్‌.. సుమంత్ అశ్విన్.. ఇలా ఒక్క హీరో కూడా క్యాష్‌ చేసుకోలేకపోతున్నారనే చెప్పాలి. అందరూ కూడా చప్పబడిన కథలకు కొత్తగా కాస్త ఉప్పూకారం అద్దేసి రంగంలోకి దించుతుంటే.. జనాలు మాత్రం వీటికి బ్రహ్మరథం ఎలా పడతారులే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/