Begin typing your search above and press return to search.
'లైగర్'తో సాహసం.. ఫలిస్తుందా?
By: Tupaki Desk | 2 May 2022 11:30 AM GMTనైజాంలో ఇప్పడు డిస్ట్రిబ్యూషన్ వార్ నడుస్తోంది. ఒకు 30 అంటే మరొకరు 40 అంటూ భారీ స్థాయిలో కోట్లు కుమ్మరిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న పేరు దిల్ రాజు. కానీ ట్రెండు మారింది. ఇప్పడు వినిపిస్తున్న పేరు వరంగల్ శ్రీను. ఏ పెద్ద సినిమా బిజినెస్ గురించి మాట్లాడినా ఈ పేరే నైజాం లో మారు మ్రోగుతోంది. ఈ డిస్ట్రిబ్యూటర్ `క్రాక్` చిత్రంతో పాపులర్ అయ్యాడు. విజయ్ `మాస్టర్` టైమ్ లో జరిగిన థియేటర్ల రచ్చతో వరంగల్ శ్రీను పేరు ఇండస్ట్రీలో రీసౌండ్ ఇచ్చింది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన `ఆచార్య` చిత్రంతో మళ్లీ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనడంతో పోటీపడి మరీ ఈ సినిమా నైజాం హక్కులకు 42 కోట్లు చెల్లించి షాకిచ్చాడు. దిల్ రాజు 32 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినా ఆయనని కాదని 42 కోట్లు కోట్ చేసిన వరంగల్ శ్రీనుకు `ఆచార్య` నైజాం ప్రదర్శన హక్కుల్ని అందించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో వరంగల్ శ్రీనుకు యాభై శాతం నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ అభిమానులని సైతం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆ నష్టాలని వరంగల్ శ్రీను ఎలా భర్తీ చేసుకోబోతున్నాడు? .. ఈ నష్టం నుంచి ఎలా బయటపడబోతున్నాడు అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
అయితే అందరికి షాకిస్తూ వరంగల్ శ్రీను `లైగర్` చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని 75 కోట్లకు దక్కించుకోవడం ఇప్పుడు పలువురు ఇండస్ట్రీ వర్గాలని షాక్ కు గురిచేస్తోంది. `ఆచార్య` అనూహ్యంగా నిరాశ పరచడంతో ఇక డిస్ట్రిబ్యూటర్ గా వరంగల్ శ్రీను పని అయిపోయినట్టేననే కామెంట్ లు వినిపించాయి.
అయితే ఆ కామెంట్ లకు షాకిస్తూ వరంగల్ శ్రీను తాజాగా మరో భారీ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని అత్యంత భారీ మొత్తానికి దక్కించుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు వెర్షన్ ప్రదర్శన హక్కుల్ని భారీ మొత్తం చెల్లించి దక్కించుకోవడం తో అంతా విస్తూపోతున్నారు.
పూజా గన్నాథ్, విజయ్ దేవరకొండ ల తొలి కలయికలో రూపొందిన చిత్రం `లైగర్`. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెటకొన్నాయి. ముంబై స్లమ్ ఏరియాలో వుండే చాయ్ వాలా ఎలా ఇంటర్నేషన్ ల్ లెవెల్లో బాక్సార్ గా పేరు తెచ్చుకున్నాడన్నదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
పూరి, చార్మితో కలిసి ఈ చిత్రానికి కరణ్ జోహార్, అపూర్వ మోహతా కూడా నిర్మాతలుగా వ్యవహరించడంతో ఈ మూవీకి హిందీలోనూ మంచి బజ్ ఏర్పడింది. డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచి భారీ డిమాండ్ పెరిగింది. భారీ రేట్లు చెబుతుండటంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కుల కోసం వరంగల్ శ్రీను పోటీ పడ్డారు.
చివరికి సొంతం చేసుకున్నారు. ఆగస్టు 25న విడుదల కానున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ గా అతని భవితవ్యాన్ని నిర్ణయించనుంది. అయితే సినిమాపై వున్న క్రేజ్ కారణంగా వరంగల్ శ్రీను `ఆచార్య` నష్టాలని `లైగర్` సినిమా కవర్ చేస్తుందని ట్రేడ్ టాక్. ఇది ఎంత వరకు నిజమవుతుందో తెలియాలంటే ఆగస్టు 25 వరకు వేచి చూడాల్సిందే.