Begin typing your search above and press return to search.
పీకే విషయంలో హరీష్ శంకర్ కి నెటి జనుడి సలహా!
By: Tupaki Desk | 27 Nov 2022 3:30 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన `గబ్బర్ సింగ్` ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. పీకే కెరీర్ లో ఈ సినిమా మరో భారీ హిట్ ని అందించిన చిత్రం. ఈ నేపథ్యంలో ఆ కాంబో అంటేనే అంచనాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. మళ్లీ ఆ ద్వయం ఎప్పుడు చేతులు కలుపుతుదా? అని చాలా కాలంగా వెయిట్ చేసారు.
చివరి కాంబో సెట్ అయిందటే పవన్ రాజకీయాల కారణంగా డిలే అవుతుంది. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో `భవదీయుడు భగత్ సింగ్` తెరకక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనొచ్చి చాలా కాలమవుతోంది. ఇంత వరకూ సినిమా సెట్స్ కి వెళ్లింది లేదు. అటు హరీష్ శంకర్ ఎప్పుడు డేట్లు కేటాయిస్తారా? అని ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నాడు.
తాజాగా `హరి హర వీరమల్లు` శర వేగంగా షూటింగ్ జరుపుకోవడంతో భవధీయుడుకి వీలైనంత త్వరగానే పీకే డేట్లు కేటాయిస్తాడని హరీష్ ధీమాగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భవధీయుడు పేరు మళ్లీ నెట్టింట ఊపందుకుంది. తాజాగా ఓ అభిమానితో హరీష్ శంకర్ జరిపిన సోషల్ మీడియా సంభాషణ ఆసక్తికరంగా మారింది.
దర్శక దిగ్గజం రాజమౌళి గురించి అమెరికన్ మీడియాలో వచ్చిన కథనంపై స్పందించిన హరీష్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ ఇలా అన్నాడు. పీకేతో ఈసారి `గబ్బర్ సింగ్` లాంటి రొటీన్ మసాలా సినిమా చేయొద్దని.. అందులో బౌన్సింగ్ పైట్లు కాకుండా రియలిస్టిక్ స్టంట్స్ ఉండేలా చూడాలని.. సినిమా ఇంటర్నేషనల్ రేంజ్లో ఉండాలని సూచించాడు. వీలైనంత వరకూ వాస్తవికతను చూపించండి అని అన్నారు.
దీనికి బధులుగా హరీష్ శంకర్... `మిమ్మల్ని నిరాశ పరుస్తున్నందుకు సారీ. మీతో నేను ఏకీభవించను`అని రాసుకొచ్చారు.`విజ్ఞాన ప్రదర్శనలు వద్దు` అనే `వెంకీ` సినిమా మీమ్‌ను కూడా పోస్ట్ చేశాడు. ఇక్కడ ఎవరి ట్యాలెంట్ వారిది. ఎవరి శైలి వారిది. రాజమౌళిలా హరీష్ శంకర్ సినిమా చేయలేరు. ఆయనలా రాజమౌళి సినిమా చేయలేరు. ఎవరి స్టైల్లో వారు తీయగలరు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.