Begin typing your search above and press return to search.
పప్పులో కాలేయకు కీర్తీ!!
By: Tupaki Desk | 2 Jun 2017 10:43 AM GMTమహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కే 'మహానటి' చిత్రం షూటింగ్ ఇప్పుడు ప్రారంభమైపోయింది. ఇప్పటికే ఓ పాట పిక్చరైజేషన్ కూడా చేసేస్తున్నారు. సావిత్రిగా కీర్తి సురేష్ గెటప్ ఎలా ఉండనుందో కూడా తెలిసిపోయింది. అయితే.. ఓ విషయంలో మాత్రం కీర్తి సురేష్ ను హెచ్చరిస్తున్నారు సన్నిహితులు.
సావిత్రి నిజ జీవితంలో కాసింత లావుగా ఉంటుంది కాబట్టి.. ఈ పాత్ర కోసం లావయేందుకు ప్రయత్నించవద్దని చెబుతున్నారు. నిజానికి సావిత్రి పాత్ర కోసం లావు పెరిగే హీరోయిన్ నే తీసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ బెడిసికొట్టి.. చివరకు కీర్తి సురేష్ దగ్గర ఆ ఆఫర్ ఆగింది. అయితే.. ఇలా ఒక పాత్ర కోసం లావు పెరిగి అనుష్క పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూస్తున్నపుడు.. మహానటి మూవీలో సావిత్రి పాత్ర కోసం లావు పెరగొద్దని చెబుతున్నారట. నిజానికి కీర్తి సురేష్ కాసింత బొద్దుగానే ఉంటుంది. కానీ సావిత్రి లుక్ పూర్తిగా కనిపించాలంటే ఇంకా లావు అవాల్సి ఉంటుంది.
అదే ఆలోచన చేస్తున్నపుడే సన్నిహితులు ఈ సలహా ఇచ్చారట. ఒక రోల్ కోసం లావయిన తర్వాత.. ఆ సైజును మళ్లీ తగ్గించుకోవడం అన్ని వేళలా సాధ్యం కాదని చెప్పేందుకు అనుష్కను ఉదాహరణగా చూపుతున్నారు. ఆ తప్పు చేసి పప్పులో కాలేయకు కీర్తీ అని గట్టిగానే చెబుతున్నారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/