Begin typing your search above and press return to search.

భ‌రత్ మ‌ద్యం సేవించ‌డంపై ఆప్తుడి మాట‌లివి

By:  Tupaki Desk   |   25 Jun 2017 4:56 PM GMT
భ‌రత్ మ‌ద్యం సేవించ‌డంపై ఆప్తుడి మాట‌లివి
X
సినీన‌టుడు ర‌వితేజ సోద‌రుడు భ‌రత్ రాజు ఆక‌స్మికంగా మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం కొత్వాల్‌ గూడ ఓఆర్‌ ఆర్‌ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో నటుడు రవితేజ సోదరుడు భరత్‌ రాజు మృతి చెందాడు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. భ‌ర‌త్ మ‌ర‌ణంపై ఆయ‌న ఆప్త‌మిత్రుడైన న్యాయ‌వాది ఆదిత్య ఉస్మానియా ఆస్ప‌త్రి వ‌ద్ద మీడియాతో మాట్లాడుతూ త‌న మిత్రుడితో ఉన్న స‌న్నిహిత్యాన్ని పంచుకున్నారు.

యాక్సిడెంట్ జ‌ర‌గ‌డానికి ముందురోజు రాత్రి భ‌ర‌త్‌ తో తాను మాట్లాడిన‌ట్లు న్యాయ‌వాది ఆదిత్య వివ‌రించారు. సుదీర్ఘ‌కాలంగా త‌మ మ‌ధ్య మితృత్వం ఉంద‌ని, ఎక్క‌డికి వెళ్లినా తాము క‌లిసే వెళ్లేవార‌మ‌ని గుర్తు చేసుకున్నారు. ఇటీవ‌ల త‌న‌కు వివాహం కావ‌డంతో త‌ను భ‌ర‌త్‌ను క‌ల‌వ‌లేద‌ని అందుకే డిన్న‌ర్‌ కు ఆహ్వానించిన‌ట్లు తెలిపారు. అయితే బిజీగా ఉన్నాన‌ని చెప్పి భ‌ర‌త్ రాలేక‌పోయిన‌ట్లు వివ‌రించారు. ఆ మరుస‌టి రోజే ఆయ‌న అక‌స్మాత్తుగా దుర్మ‌ర‌ణం పాల‌య్యార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తన‌తో మాట్లాడిన స‌మ‌యంలో భ‌ర‌త్ మ‌ద్యం సేవించి ఉన్నారో లేదో తెలియ‌ద‌ని వివ‌రించారు.

కాగా, ప్రమాదానికి గురైన కారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో ఉంది. ఈ ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. పెట్రోలింగ్ సిబ్బంది ఈ ప్ర‌మాదాన్ని గుర్తించారు. భ‌ర‌త్ గ‌తంలో ఒక్కడే - అతడే ఒక సైన్యం - పెదబాబు - దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో న‌టించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/