Begin typing your search above and press return to search.
ఆ రెండూ బాక్సాఫీస్ ని కుమ్మేస్తున్నాయ్
By: Tupaki Desk | 30 Oct 2016 4:58 AM GMTఈ దీపావళికి రెండు బాలీవుడ్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. రిలీజ్ కి ముందు నుంచి ఈ చిత్రాల మధ్య బోలెడన్ని కాంట్రవర్సీలు రగిల్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఒకరి సినిమాను మరొకరు దెబ్బకొట్టేందుకు ట్రై చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి. విడుదలకు ముందు ఎన్ని జరిగినా.. ఇప్పుడు అజయ్ దేవగన్ నటించిన శివాయ్.. కరణ్ జోహార్ డైరెక్షన్ లో వచ్చిన ఏ దిల్ హై ముష్కిల్ థియేటర్లలో సందడి చేస్తున్నాయి.
ఈ రెండు చిత్రాలు దేనికవి విభిన్నమైనవి కావడంతో.. ఆడియన్స్ రెండిటికీ ఓటేసినట్లుగానే కనిపిస్తోంది. మొదటి రోజున రెండూ భారీ వసూళ్లనే రాబట్టాయి. యే దిల్ హై ముష్కిల్ కు 13.30 కోట్ల రూపాయల వసూళ్లతో.. కరణ్ డైరెక్షన్ లోనే బిగ్గెస్ట్ ఫస్ట్ డే గ్రాసర్ గా నిలిచింది. మరోవైపు అజయ్ దేవగన్ డైరెక్షన్ వహించి నటించిన శివాయ్ కు.. తొలి రోజు 10.24 కోట్ల వసూళ్లు దక్కాయి. మల్టీప్లెక్సుల్లో రణబీర్-ఐశ్వర్య-అనుష్కల సినిమా సత్త చాటుతుంటే.. సింగిల్ స్క్రీన్లు- బీసీ సెంటర్ల హంగామా అంతా శివాయ్ కేప్చర్ చేసేశాడు.
వీకెండ్స్ పండుగ రోజులు కావడంతో.. వసూళ్లు భారీగా పెరిగే ఛాన్సులు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే పాజిటివ్ టాక్ ఉండడంతో.. యే దిల్ హై ముష్కిల్- శివాయ్ లు హిట్ కొట్టేయడం పెద్ద కష్టమేం కాదన్నది బాలీవుడ్ ట్రేడ్ జనాల టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/