Begin typing your search above and press return to search.
బూతు బొమ్మకు కలెక్షన్ల జోరు మామూలుగా లేదుగా?
By: Tupaki Desk | 10 Nov 2019 10:11 AM GMTమా సినిమా అద్భుతమని ప్రతి ఒక్కడు చెప్పేటోడే. కానీ.. అందుకు భిన్నంగా మా సినిమా పక్కా బోకు సినిమా. పచ్చి బూతు సినిమా. సెన్సార్ చేసినోళ్లు సిగ్గు పడిపోయారంటూ బోల్డ్ గా పచ్చి నిజాన్ని చెప్పి మరీ విడుదల చేసిన సినిమా ఏడు చేపల కథ. టైటిల్ లో కథ ఉంది కదా? అన్న డౌట్ అక్కర్లేదని.. తమ సినిమాలో కథ అస్సలు ఉండదని.. యూత్ కావాల్సిన కంటెంట్ మస్తుగా ఉందని ఓపెన్ గా చెప్పేశారు.
దీనికి తగ్గట్లే పోస్టర్లతో హీట్ పెంచేసి.. టీజర్.. ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేయటంలో సక్సెస్ అయ్యారు దర్శక నిర్మాతలు. గతంలో తాము మంచి సినిమా చేసి నాశనమయ్యామని.. అందుకే ఈసారి పక్కా బూతు సినిమా చేయాలని డిసైడ్ అయ్యామంటూ ఓపెన్ గానే మాట్లాడేసింది ఈ చిత్ర యూనిట్.
ఇంత చెప్పిన తర్వాత ఈ తరహా కంటెంట్ ను ఇష్టపడే వారు ఊరుకుంటారా? మీరింత ఓపెన్ అయ్యాక.. మేం మాత్రం ఓపెన్ కాకుంటే ఏం బాగుంటుంది భయ్యా అని అనుకున్నారేమో కానీ.. భారీ ఎత్తున స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీకి కాసుల గలగలలు భారీగా ఉన్నట్లు చెబుతున్నారు.
సినిమా విడుదలైన తొలి రోజున రూ.1.9 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. రెండో రోజు పుంజుకొని రూ2.4 కోట్ల గ్రాస్ ను సాధించి బ్రేక్ ఈవెన్ కొట్టేసిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏమీ దాచుకోకుండా తమ సినిమా గురించి నిజాలు చెప్పేసిన దర్శక నిర్మాతలు రెండో రోజు కలెక్షన్లతో సేఫ్ జోన్లోకి వచ్చేశారట. ఈ రోజు (ఆదివారం) కలెక్షన్ల జోరు అదే స్థాయిలో కొనసాగితే.. పండుగే అంటున్నారు. ఏమైనా.. బూతును ఇంత ఓపెన్ గా ప్రమోట్ చేసి కమర్షియల్ హిట్ కొట్టిన వీరి ధైర్యం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.