Begin typing your search above and press return to search.

హిందీ ఇండ‌స్ట్రీని షేక్ చేసిన 'ఎఫైర్స్'

By:  Tupaki Desk   |   13 Oct 2022 2:30 AM GMT
హిందీ ఇండ‌స్ట్రీని షేక్ చేసిన ఎఫైర్స్
X
'ఎఫైర్స్' నేటి మోడ్ర‌న్ స‌మాజంలో రొటీన్ గా చూస్తున్న‌వే. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ టెంప్టేష‌న్ కామ‌న్. కానీ సినీప‌రిశ్ర‌మ‌లో ఏం జ‌రిగినా అది వెంటనే మీడియాలో హైలైట్ అవుతుంది. ఆ ర‌కంగా చూస్తే బాలీవుడ్ లో నిరంత‌రం ఇలాంటి ఎఫైర్ క‌హానీల‌కు కొద‌వేమీ లేదు. పెళ్ల‌యిన హీరోల‌తో హీరోయిన్ల‌ వివాహేతర సంబంధాలపై ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న‌ సందర్భాలు కోకొల్ల‌లు. అయితే బాలీవుడ్ ని కుదిపేసిన ప‌లు వివాహేత‌ర సంబంధాల‌పై ఓ లుక్కేస్తే తెలిసిన సంగ‌తులివి...

ప్రియాంక చోప్రా-షారూఖ్ ఖాన్

ఓ ప్ర‌ముఖ హిందీ మీడియా క‌థ‌నం ప్ర‌కారం... SRK ఓ సీనియ‌ర్ నాయిక‌తో ఎఫైర్ సాగించాడు. ఆ త‌ర్వాత అందాల రాణి ప్రియాంక చోప్రాతో చాలా కాలంగా స‌న్నిహితంగా మెలిగాడు. ఆమె కింగ్ ఖాన్ కి పెద్ద అభిమాని. వారిద్దరూ డాన్ (2006) సినిమాకి క‌లిసి పనిచేశారు. షారూక్ తో నిండా ప్రేమ‌లో మునిగింద‌ని ప్ర‌చార‌మైంది. ఇక‌ ప్రియాంకకు ప‌లువురు హీరోల‌తో సంబంధాలు ఉన్నాయని అవి ఎప్పుడూ బహిరంగంగా బయటకు రాలేదని అలాంటి వారిలో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు అని బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది. ఈ క‌థ‌నాల‌తో గౌరీఖాన్ కూడా క‌ల‌త చెందార‌ని వార్త‌లొచ్చాయి.

శతృఘ్న సిన్హా-రీనా రాయ్

ప్రముఖ నటుడు శతృఘ్న సిన్హా పూనమ్ సిన్హాను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు-లువ్ సిన్హా- కుష్ సిన్హా- సోనాక్షి సిన్హా ఉన్నారు. జాగరణ్ టైమ్స్ లోని ఒక నివేదిక ప్రకారం... శత్రుఘ్న పెళ్ల‌యి పిల్ల‌లున్నా కానీ న‌టి రీనా రాయ్ తో ప్రేమలో పడ్డాడు. 19 సంవత్సరాల వయస్సులో ఆమె కాళీచరణ్ (1976)తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆ సమయంలో సిన్హాజీ వయస్సు 30. శత్రు అంత‌కుముందు పూనమ్ తో ప్రేమలో పడ్డప్పటికీ అతను రీనాను క‌ల‌వ‌డం మాట్లాడటం ఆపలేకపోయాడు. దాంతో ఆ ఇరువురి న‌డుమా ఏదో జ‌రుగుతోంద‌ని ప్ర‌చార‌మైంది.

ప్రియాంక చోప్రా-అక్షయ్ కుమార్

పాపుల‌ర్ మీడియా క‌థ‌నం ప్రకారం.. అక్షయ్ కుమార్ కు ప్రియాంక చోప్రాతో వివాహేతర సంబంధం ఉంది. 2003లో 'అందాజ్‌' మూవీ కోసం క‌లిసి పనిచేస్తున్నప్పుడు ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు చేరువ‌య్యారు. అటుపై వ‌రుస‌గా మరో 3 సినిమాలకు సంతకం చేశారనీ.. అయితే వారి ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీపై అక్కీ భార్య‌ ట్వింకిల్ క‌ల‌త చెందింద‌ని.. గ్లోబ‌ల్ సుంద‌రి ప్రియాంక చోప్రాతో కలిసి పని చేయొద్ద‌ని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు గుస‌గుస‌లు వినిపించాయి.

మిథున్ చక్రవర్తి-శ్రీదేవి

1979లో స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ప్ర‌ముఖ‌ గాయకుడు కిషోర్ కుమార్ మొదటి భార్య అయిన యోగితా బాలిని వివాహం చేసుకున్నాడు. జాగరణ్ టైమ్స్ లోని ఒక కథనం ప్రకారం... మిథున్ ఆ త‌ర్వాత‌ శ్రీదేవికి దగ్గరయ్యాడు. 1985లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అతని భార్య యోగిత ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో 1988లో శ్రీ‌దేవికి విడాకులు ఇచ్చాడు. శ్రీదేవి 1996లో బోనీ కపూర్ ని పెళ్లాడారు. బోనీకి పెళ్ల‌యి అప్ప‌టికే పిల్ల‌లుండ‌డంతో ఆ ఇంట్లో బోలెడ‌న్ని క‌ల‌త‌లు ఏర్ప‌డ్డాయి.

అజయ్ దేవగన్-కంగనా రనౌత్

ప్ర‌ముఖ మీడియా క‌థ‌నం ప్ర‌కారం.. 'ముంబైలో వన్స్ అపాన్ టైమ్' షూటింగ్ సమయంలో అజయ్ దేవగన్ క‌ర్లీ హెయిర్ బ్యూటీ కంగనా రనౌత్ అందానికి ఆకర్షితుడయ్యాడు. ఆ ఇద్దరిపైనా ర‌క‌ర‌కాల రూమ‌ర్లు పుట్టుకొచ్చాయి కూడా. తన సినిమాను ఎప్పటికీ ప్రమోట్ చేయనని కంగ‌న‌ ఒకసారి ఇంటర్వ్యూలో చిలిపిగా వెల్లడించింది. దేవ‌గ‌న్ ఇతర సినిమాలను ప్రమోట్ చేస్తాడు కానీ కంగ‌న‌ సినిమాలను ఎప్పుడూ ప్రమోట్ చేయడు.. దీని వెన‌క మ‌త‌ల‌బు ఏంటో అర్థం చేసుకోవాలి.

అమీర్ ఖాన్-ఫాతిమా సనా షేక్

అమీర్ ఖాన్ త‌న రెండో భార్య‌ కిరణ్ రావు నుండి విడిపోక ముందే 'దంగ‌ల్' ఫేం ఫాతిమా సనా షేక్ తో ప్రేమలో పడ్డాడు. ఫాతిమా వ‌ల్ల‌నే ఆ ఇద్ద‌రూ విడిపోయార‌ని చాలా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. మీడియా నివేదిక‌ల ప్రకారం.. ఫాతిమా అమీర్ సన్నిహిత కుటుంబ పార్టీలకు హాజరవుతుంది. ఆమె అమీర్ కోసం సెట్స్ కి కూడా వస్తుంది. కిర‌ణ్ రావుతో విడాకులు స‌హా అమీర్ చ‌ర్య‌ల‌పై నెటిజ‌నులు అభిమానులు అంత సంతృప్తిగా లేరు. అది ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాల్లో ప్ర‌తిఫ‌లిస్తోంది. అత‌డి సినిమాల‌ను కూడా సామాజిక మాధ్య‌మాల్లో నిషేధించ‌డం వెన‌క ఇలాంటి కార‌ణాలు కూడా ఉన్నాయి.

సన్నీ డియోల్-డింపుల్ కపాడియా

సీనియ‌ర్ నటుడు స‌న్నీడియోలో పూజా డియోల్ ను వివాహం చేసుకున్నాడు. కానీ ఆ త‌ర్వాత‌ డింపుల్ కపాడియాతో ప్రేమలో పడ్డాడు. ప్ర‌ముఖ మీడియాలో ప్రచురించిన క‌థ‌నం ప్రకారం.. ఆ సమయంలో డింపుల్ అప్పటికే రాజేష్ ఖన్నా నుండి విడిపోయింది. డింపుల్ - స‌న్నీ ఇద్దరూ ఇప్పటికీ ఒకరినొకరు విడిచి ఉండ‌లేక‌పోతున్నార‌ని.. సన్నిహిత సంబంధం ఉందని క‌థ‌నాలొచ్చాయి. ఈ జంట‌ ఫోటోలు 2017లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని కూడా కనిపించారు. అయితే వారి మ‌ధ్య రిలేష‌న్ పై వంద శాతం నిజ‌నిర్ధారణ లేదు.

ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో మ‌లైకా అరోరాఖాన్ ఆర్భాజ్ ఖాన్ తో సంబంధంలో ఉండ‌గానే యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో స‌న్నిహితంగా ఉండ‌డం బాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆర్భాజ్ నుంచి మ‌లైకా విడిపోయాక అర్జున్ తో సంబంధం అధికారిక‌మైంది. ఆర్భాజ్ ఖాన్ సైతం వేరొక క‌థానాయిక‌తో ఎఫైర్ పెట్టుకున్నాడు.

పెళ్ల‌యిన హీరోల‌తో క‌థానాయిక‌ల ఎఫైర్లు అల‌జ‌డులు సృష్టించాయ‌న్న‌ది నిజం. ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు విడిపోయిన త‌ర్వాత కొత్తగా ఎఫైర్లు పెట్టుకోవ‌డం ష‌రా మామూలుగా చూసేదే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.