Begin typing your search above and press return to search.
దేశం విడిచి పారిపోయిన ఆఫ్ఘనీ పాప్ సింగర్
By: Tupaki Desk | 21 Aug 2021 2:30 PM GMTతాలిబన్ల దెబ్బకు సామాన్యులు మాన్యులు అనే తేడా లేకుండా దేశం విడిచి పరుగులు పెడుతున్నారు. విమానంలో చోటు దొరక్కపోతే రెక్కలపై చోటు వెతుక్కుంటున్నారు. ఈ దారుణ స్థితి ఎన్నడూ చూడనిది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన అతిపెద్ద పాప్ స్టార్ ఆర్యానా సయీద్ తాలిబాన్లు రాజధాని నగరం కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత దేశం విడిచి పారిపోయారు. ప్రాణ భయంతో ఆమె కాబూల్ నుంచి అమెరికా విమానంలో తప్పించుకుంది. దోహా మీదుగా జారుకుంది. ప్రస్తుతం తాలిబాన్ల ఆక్రమణల ఫర్వం కొనసాగుతుంటే.. ఆ దేశ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలిపోయింది.
ఇకపై తీవ్రవాద సమూహం కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ లో కొత్త రూల్స్ ప్రకారం.. మహిళలు బురఖా ధరించాలి. పురుషులు లేకుండా తమ ఇళ్లను విడిచిపెట్టకూడదు. స్త్రీల స్వేచ్ఛా హక్కులను రద్దు చేస్తారు. బాలికలు పాఠశాలకు వెళ్లవచ్చా .. మహిళలు పని చేయవచ్చా అనే విషయాలను మత పండితులు నిర్ణయిస్తారని వారు ప్రకటించారు. మహిళల కఠినమైన జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని పాప్ స్టార్ ఆర్యానా సయీద్ యుఎస్ కార్గో జెట్ లో దేశం విడిచి పారిపోయారు. ది వాయిస్ ఆఫ్ఘన్ వెర్షన్ లో విమానం నుంచి తప్పించుకున్న చిత్రాన్ని షేర్ చేయగా వైరల్ అవుతోంది. నేను బాగా ఉన్నాను.. సజీవంగా ఉన్నాను. కొన్ని మర్చిపోలేని రాత్రుల తర్వాత దోహా.. ఖతార్ చేరుకున్నాను. చివరికి ఇస్తాంబుల్ లో ఇంటికి తిరిగి వెళుతున్నాను.. అంటూ సమాచారం చేరవేసింది.
పారిపోయాక తన ఉద్వేగాలను సదరు గాయని దాచుకోలేదు. నేను ఇంటికి చేరుకున్న తర్వాత నా మనస్సు భావోద్వేగానికి గురైంది. షాక్ నుండి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మీతో పంచుకోవడానికి నాకు చాలా కథలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు దేశం నుండి విమానాలను కనుగొనడానికి కష్టపడుతున్నారు. నేను అదృష్టవంథురాలిని అంటూ పరిస్థితిని వివరించారు.