Begin typing your search above and press return to search.

7 నెల తర్వాత ఆ ముగ్గురు.. RRR ట్రియో జోష్ ఏమాత్రం తగ్గలేదు..!

By:  Tupaki Desk   |   20 Oct 2022 8:55 AM GMT
7 నెల తర్వాత ఆ ముగ్గురు.. RRR ట్రియో జోష్ ఏమాత్రం తగ్గలేదు..!
X
కొన్ని కాంబినేషన్లు సెట్ అవడమే సంచలనం అనిపిస్తాయి. ఆ కాంబినేషన్స్ లో వచ్చిన సినిమా హిట్టు పడితే దాని రీ సౌండ్ ఎప్పటికి అలా వినిపిస్తూనే ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే క్రేజీ కాంబో.. అదిరిపోయే మల్టీస్టారర్ సెట్ చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి.

బాహుబలి లాంటి సినిమా తీశాక ఆయన కథ చెబితే వినను అని చెప్పే సాహసం ఏ హీరో చేయడు. ఈ క్రమంలోనే ఆర్.ఆర్.ఆర్ అంటూ మెగా నందమూరి హీరోలని కలిపి సినిమా చేశాడు. చిరంజీవి, బాలకృష్ణ కూడా కలిసి చేయలేని సాహసం చేశారు ఎన్.టి.ఆర్, రాం చరణ్.

ఆర్.ఆర్.ఆర్ సినిమా తెలుగు సినిమాకు ఓ కొత్త మార్గాన్ని చూపించింది. కథా బలం ఉంటే చాలు ఊహించని కాంబోలు కూడా సెట్ చేస్తాయని ప్రూవ్ చేసింది. రాజమౌళి ముద్ర పడ్డది అంటే సినిమా రిజల్ట్ ఏంటన్నది అందరికి తెలిసిందే.

అనుకున్నట్టుగానే బాక్సాఫీస్ దగ్గర ఆర్.ఆర్.ఆర్ 1100 కోట్లు కొల్లగొట్టింది. RRR సినిమా రిలీజై ఏడు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట సందడి చేస్తూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ లో 14 వారాల పాటుగా టాప్ ప్లేస్ లో ఉంటూ వచ్చిన ఈ మూవీ వరల్డ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. మొన్నటిదాకా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ అయిన ఆర్.ఆర్.ఆర్ ప్రస్తుతం జపాన్ లో థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అయ్యింది.

జపాన్ లో రిలీజ్ అవుతున్న కారణంగా దర్శకుడు రాజమౌళి హీరోలు ఎన్.టి.ఆర్, రాం చరణ్ అక్కడ ప్రమోషన్స్ చేసేందుకు షిఫ్ట్ అయ్యారు.

జపాన్ లో సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాజమౌళి, చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రిలీజ్ హంగామాలో RRR ట్రియోని చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ ఇండియా రిలీజ్ టైం లో ఓ రేంజ్ లో ప్రమోట్ చేసిన ఎన్.టి.ఆర్, చరణ్, రాజమౌళి జపాన్ లో కూడా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా.. రామ రాజు పాత్రలో చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ లు కూడా నటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.