Begin typing your search above and press return to search.

మాస్ ద‌స‌రా బుల్లోడితో స‌ర‌దాల కీర్తి

By:  Tupaki Desk   |   30 Jan 2022 3:00 PM IST
మాస్ ద‌స‌రా బుల్లోడితో స‌ర‌దాల కీర్తి
X
అందాల క‌థానాయిక కీర్తి సురేష్ కి చెప్పుకోద‌గ్గ హిట్లిచ్చింది కుర్ర‌హీరోలే. నాని - విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి యువ‌హీరోల సినిమాల‌తోనే బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంది. ఇంత‌కుముందు నాని స‌ర‌స‌న నేను లోక‌ల్ అనే హిట్ చిత్రంలో న‌టించింది కీర్తి సురేష్. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత నేను లోకల్ స్టార్స్ నాని- కీర్తి సురేష్ క‌లిసి జంట‌గా న‌టిస్తున్నారు.

ఈ ముచ్చ‌టైన జంట `దసరా` అనే చిత్రంతో దూసుకొస్తున్నారు. ఈ చిత్రం నాని- కీర్తి కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిల‌వ‌నుంది. ఇటీవల హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ ను నిర్మించేందుకు ఏకంగా నిర్మాత‌లు రూ.10 కోట్లు పైగా వెచ్చించారు. దసరా తెలంగాణ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా. డార్క్ టోన్ తో మాసీ పాత్ర‌ల‌తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే కంటెంట్ ఉన్న సినిమా ఇద‌ని తెలుస్తోంది.

తాజాగా రివీలైన పోస్ట‌ర్ లో నాని రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. ఇంత‌కుముందు ఫస్ట్ లుక్ లోనూ అంతే ర‌ఫ్ గా క‌నిపించాడు. మునుపెన్న‌డూ లేని విధంగా నాని లుక్ క‌నిపిస్తోంది. కోర మీసం.. ర‌ఫ్ అండ్ ర‌గ్ డ్ గడ్డంతో క‌నిపిస్తున్నాడు. ఈ సినిమాలో తెలంగాణ యాసలో నాని మాట్లాడుతాడు. తాజా స‌మాచారం మేర‌కు... కీర్తి సురేష్ కూడా దసరాలో మునుపెన్నడూ చూడని డి గ్లామరస్ పాత్రలో కనిపించనుంది. నానిలాగే కీర్తి కూడా తన అద్భుతమైన మేకోవర్ తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆద‌ర్ బ్యాక్డ్ స్టోరీల్లో అద్భుత పాత్ర‌ల్లో న‌టించిన కీర్తి ఇప్పుడు `దసరా`లోనూ అద్భుత పాత్ర‌తో అల‌రించ‌నుంద‌ని స‌మాచారం.

యంగ్ మలయాళ హీరో రోషన్ మాథ్యూ దసరాతో టాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆగస్టులో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాత‌. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.