Begin typing your search above and press return to search.

స్పీడు పెంచిన కార్తీ...స‌మంత‌కు గ్రీన్ సిగ్న‌ల్

By:  Tupaki Desk   |   2 Feb 2022 3:30 AM GMT
స్పీడు పెంచిన కార్తీ...స‌మంత‌కు గ్రీన్ సిగ్న‌ల్
X
`సుల్తాన్‌` ఎక్స్ పెక్టేష‌న్ కి త‌గ్గ విజ‌యం సాధించ‌క‌పోయినా ఫ‌ర‌వాలేద‌నిపించింది. ఈ మూవీ త‌రువాత కార్తీ బ్యాక్ టు బ్యాక్ విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తున్నారు. `స‌ర్దార్‌`లో వ‌య‌సు మ‌ళ్లిన వ్య‌క్తిగా, విరుమ‌న్ లో ప‌క్కా గ్రామీణ యువ‌కుడిగా.., `పొన్నియ‌న్ సెల్వ‌న్`లో చోళ రాజు వ‌ల్ల‌వ‌రాయ‌న్ వంధ్య దేవ‌న్ గా క‌నిపించ‌బోతున్నారు. ఇలా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ స‌రికొత్త చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి రెడీ అవుతున్నాడు.

ఇప్న‌టికే మూడు చిత్రాల‌ని లైన్ లో పెట్టిన కార్తీ తాజాగా మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. తాజాగా త‌మిళంలో విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించిన `బ్యాచిల‌ర్` మూవీ డైరెక్ట‌ర్ స‌తీష్ సెల్వ‌కుమార్ చెప్పన స్టోరీ న‌చ్చ‌డంతో అత‌నితో సినిమా చేయ‌డానికి కార్తి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ఇప్ప‌టికే ఈమూవీకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యింద‌ని తెలిసింది. ఇందెలో కార్తీకి జోడీగా న‌టించ‌డానికి హీరోయిన్ స‌మంత ని ద‌ర్శ‌కుడు సంప్ర‌దించార‌ట‌.

స్టోరీ న‌చ్చ‌డంతో సామ్ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌కు విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత నుంచి స‌మంత వ‌రుస ప్రాజెక్ట్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తోంది. ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ `య‌శోద‌`లో న‌టిస్తున్న స‌మంత బాలీవుడ్ లో క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ య‌ష్ రాజ్ ఫిల్మ్స్ లో మూడు చిత్రాల‌ని అంగీక‌రించిందంటూ వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా కార్తీ మూవీని కూడా అంగీక‌రించింద‌ని వార్తలు వినిపిస్తుండ‌టంతో స‌మంత స్పీడు పెంచేసింద‌ని అంటున్నారు. అంతే కాకుండా కార్తి కూడా ఇప్ప‌టికే మూడు భారీ చిత్రాల‌ల్లో న‌టిస్తూ బిజీగా వుండి కూడా తాజాగా మ‌రో సినిమాకు ఓకే చెప్ప‌డంతో త‌ను కూడా స్పీడు పెంచేశాడ‌ని అంటున్నారు. ఇదిలా వుంటే గ‌తంలో స‌మంత ... కార్తి సోద‌రుడు సూర్య‌తో క‌లిసి 24, సికింద‌ర్ వంటి చిత్రాల్లో న‌టించింది. ఇందులో `24` సూప‌ర్ హిట్ కాగా `సికింద‌ర్‌` ఫ్లాప్ గా నిలిచింది.