Begin typing your search above and press return to search.
కీర్తి నో చెప్పడంతో కాజల్ తో రానా చర్చలు
By: Tupaki Desk | 18 Sept 2019 4:21 PM ISTకొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' చిత్రాన్ని తెలుగులో 'ఓ బేబీ'గా రీమేక్ చేసిన విషయం తెల్సిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్ బాబు ఇంకా కొందరు నిర్మాతలు కలిసి ఓ బేబీ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో నందిని రెడ్డితో మరో సినిమాను నిర్మించాలని రానా నిర్ణయించుకున్నాడు. అందుకోసం మరో కొరియన్ మూవీనే ఎంచుకున్నారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఒక కొరియన్ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు రానా సిద్దం అయిన విషయం తెల్సిందే. ఆ రీమేక్ కు హీరోయిన్ గా కీర్తి సురేష్ ను సంప్రదించగా ఆమె నో చెప్పింది.
ప్రస్తుతం హిందీలో మైదాన్ మరియు తెలుగులో మిస్ ఇండియా చిత్రాలు మాత్రమే కాకుండా ఇంకా పలు చిత్రాలకు కమిట్ అయిన కారణంగా కీర్తి సురేష్ నో చెప్పింది. దాంతో ఆమె స్థానంలో కాజల్ ను ఎంపిక చేసేందుకు రానా ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు మరియు తమిళంలో మంచి క్రేజ్ ఉన్న కాజల్ అయితే ఈ రీమేక్ కు న్యాయం చేస్తుందని నందిని రెడ్డి మరియు కాజల్ లు ఒక నిర్ణయానికి వచ్చారని అందుకే ఆమెతో చర్చలు జరుపతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం కాజల్ కు తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేవు. తమిళంలో ఇండియన్ 2 మరియు హిందీలో ఒక చిత్రాన్ని మాత్రమే చేస్తోంది. అందుకే కాజల్ ఖచ్చితంగా ఈ రీమేక్ కు ఒప్పుకుంటుందని అంటున్నారు. పవర్ ఫుల్ రోల్ లో కాజల్ ఆకట్టుకుంటుందా లేదా అనేది ఆడిషన్స్ నిర్వహించి.. స్క్రీన్ టెస్టు చేసిన తర్వాత నిర్ణయించనున్నారట. అంతా ఓకే అయితే రానాతో గతంలో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో నటించిన కాజల్ ఇప్పుడు రానా నిర్మాణంలో లేడీ ఓరియంటెడ్ చిత్రంను నందిని రెడ్డి దర్శకత్వంలో చేయడం ఖాయం అంటున్నారు.