Begin typing your search above and press return to search.
నిహారికతో పెళ్లి తర్వాత మాటలు తగ్గాయిః నాగబాబు
By: Tupaki Desk | 24 Jan 2021 11:10 AM GMTమెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికకు పూర్తి స్వేచ్చ ఇచ్చి ఆమెకు కావాల్సిన విధంగా నడుచుకోవచ్చు అంటూ అన్ని విధాలుగా ఆమెను ఎంకరేజ్ చేశారు. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి అమ్మాయి నిహారిక. కొందరు వద్దంటూ వారించినా కూడా నాగబాబు తన కూతురును హీరోయిన్ గా చేసేందుకు ఒప్పుకున్నాడు అనేది టాక్. ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. గంటలు గంటలు మాట్లాడుకుంటారు అంటూ ఇద్దరి గురించి తెలిసిన వారు అంటూ ఉంటారు. కాని పెళ్లి తర్వాత ఇద్దరి మద్య మాటలు తగ్గాయట. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు ఒక సందర్బంగా చెప్పుకొచ్చాడు. అయినా కూడా తాను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.
పెళ్లి తర్వాత అమ్మాయిల బాధ్యతలు బంధువులు పెరుగుతారు. కనుక మునుపటి మాదిరిగా మాట్లాడటం సాధ్యం కాదు. కనుక నిహారిక ఈమద్య కాలంలో నాతో మాట్లాడటం తక్కువ అయ్యింది. ప్రతి రోజు ఒక సారి అయినా మాట్లాడుతాం. కాని గతంతో పోల్చితే మాత్రం తగ్గిందని నాగబాబు అన్నాడు. నిహారిక తో మాటలు తగ్గినా కూడా తను ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్లినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారంటూ కూతురు అల్లుడు గురించి నాగబాబు చెప్పుకొచ్చాడు. ఇక నాగబాబు తన కొడుకు వరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది పెద్దగా పట్టింపు లేదు. కాని అతడి భవిష్యత్తు బాగా ఉండేలా మంచి అమ్మాయిని ఎంపిక చేసుకుంటే చాలు అన్నాడు.