Begin typing your search above and press return to search.
9 ఏళ్ల తర్వాత ఓకే చెప్పింది!
By: Tupaki Desk | 26 Nov 2018 5:33 AM GMTప్రస్తుతం సౌత్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ నయనతార. ఒక వైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ మరో వైపు తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ డాల్ పాత్రలు చేస్తూ వస్తోంది. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా ప్రస్తుతం నయనతార ఉందంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. వరుసగా మల్టీస్టారర్ లు చేస్తున్న నయన్ తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కి జోడీగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు 9 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.
విజయ్ - అట్లీల కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరు ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని అంతా నమ్ముతున్నారు. ఇంతటి భారీ క్రేజీ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార అయితే బాగుంటుందని అట్లీ కుమార్ అనుకున్నాడట. ఈ చిత్రం కోసం పలువురు హీరోయిన్స్ ను పరిశీలించిన తర్వాత చివరకు ఈమెను ఎంపిక చేయడం జరిగింది.
నయన తార హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన సమయంలో విజయ్ కి జోడీగా రెండు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత విజయ్ చిత్రంలో నయనతార ను నటింపజేయాలని దర్శకులు భావించినా ఏదో ఒక కారణం వల్ల సాధ్యం కాలేదు. ఆమద్య మురుగదాస్ కూడా నయనతార ను విజయ్ కి జోడీగా ఎంపిక చేసేందుకు ప్రయత్నించగా డేట్లు సర్దుబాటు కావని చెప్పిందట. అయితే 9 ఏళ్ల తర్వాత మళ్లీ విజయ్ తో నటించేందుకు నయన్ సైన్ చేసింది. వీరిద్దరి కాంబినేషన్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటూ విజయ్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అన్ని విధాలుగా ఈ చిత్రంకు పాజిటివ్ బజ్ ఉన్న కారణంగా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశం ఉందని తమిళ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేసేందుకు అట్లీ ప్రయత్నాలు చేస్తున్నాడు.