Begin typing your search above and press return to search.
సుశాంత్ సింగ్ తర్వాత మాఫియా టార్గెట్ ఆ హీరోనే..!!
By: Tupaki Desk | 21 Jun 2021 6:30 AM GMTయంగ్ ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనూహ్య మరణం బాలీవుడ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అతడి మరణం వెనక బాలీవుడ్ మాఫియా (కొందరు సినీ పెద్దల) హస్తం ఉందన్న బలమైన వాదనలు వినిపించాయి. ఇండస్ట్రీ ఔట్ సైడర్స్ ఇన్ సైడర్స్ టాపిక్ .. నటవారసత్వం సహా డ్రగ్స్ వంటి విషయాలు నెటిజనుల్లో చర్చకు వచ్చాయి. సుశాంత్ సింగ్ వరస హిట్లలో నటిస్తున్నా అతడిని బాలీవుడ్ మాఫియా వెంటాడింది. ఒకానొక దశలో అతడు అరడజను అవకాశాలు ఈ మాఫియా వల్లనే కోల్పోయాడని ప్రముఖ రాజకీయ నాయకుడు వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనమైంది. దీనిపై కంగన పదే పదే మీడియా ముఖంగా మాఫియాని ఎండగడుతూనే ఉంది.
అయితే బాలీవుడ్ లో ఇదే అన్ వాంటెడ్ మాఫియా మరో యువహీరోని కూడా తొక్కేస్తోందన్న వాదన అంతకంతకు బలపడుతోంది. అందుకు ఆధారాలు కూడా స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రతిభావంతుడైన యంగ్ హీరో ఎవరో ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుసగా బంపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ యువతరంలో అసాధారణ ఫాలోయింగ్ సంపాదించుకున్న కార్తిక్ ఆర్యన్ పై బాలీవుడ్ మాఫియా గురి పెట్టిందన్న చర్చ సాగుతోంది.
కరణ్ జోహార్ -దోస్తానా 2 నుండి కార్తీక్ ని తొలగించిన తరువాత షారూఖ్ ఖాన్ సంస్థ నిర్మిస్తున్న `ఫ్రెడ్డీ` నుండి బహిష్కరించడం ఈ చర్చకు తెరలేపింది. కార్తీక్ ఆర్యన్ మరిన్ని ప్రాజెక్టులను కోల్పోయి ఉండవచ్చని పుకార్లు అస్పష్టంగా షికార్ చేస్తున్నాయి. దర్శకనిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ తన గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కోసం కార్తీక్ అర్యన్ పేరును పరిశీలించారు. కానీ ఇందులో అవకాశం ఉంటుందా లేదా? అన్నదానిపై క్లారిటీ మిస్సయ్యింది. ఈ చిత్రానికి రాయ్ సహాయకుడు దర్శకత్వం వహిస్తారు. కానీ కార్తీక్ ఆర్యన్ సంతకం చేసేందుకు రెడీగా ఉన్నా.. ఇంతలోనే పరిస్థితి మారిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ కార్తీక్ ను వదిలించుకున్న క్రమంలోనే ఇది ఇతరులను ప్రభావితం చేసిందని.. ఓ బాలీవుడ్ ప్రముఖుడు విశ్లేషించారు. అంతేకాదు ఈ ప్రాజెక్టులో కార్తీక్ స్థానంలో వేరొక హీరోని ఫైనల్ చేసారన్నది కార్తీక్ కి తెలియదని కూడా గుసగుసలు వేడెక్కించాయి. కార్తీక్ స్థానంలో ఆయుష్మాన్ ఖుర్రానా పేరును పరిశీలిస్తున్నారన్న టాక్ తాజాగా వినిపిస్తోంది.
తన కెరీర్ ధేధీప్యమానంగా వెలుగుతున్న క్రమంలోనే అనూహ్యంగా సుశాంత్ సింగ్ వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని కోల్పోయాడు. కరణ్ జోహార్- భన్సాలీ సహా చోప్రాలు అతడిని దూరం పెట్టారు. ఇప్పుడు కూడా కార్తీక్ ఆర్యన్ విషయంలో అలానే జరగబోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే సుశాంత్ సింగ్ తరహాలో ఓటమి పాలవ్వకుండా ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ మాఫియాని ఎదురించేందుకు ఎలాంటి దారిని ఎంచుకుంటాడు? అన్నది కూడా అతడి అభిమానుల్లో చర్చకు వస్తోంది. ఏటికి ఎదురీది పరిస్థితుల్ని తెలివిగా తనవైపు తిప్పుకునే చాణక్యం కార్తీక్ ఆర్యన్ కి ఉందా? బాలీవుడ్ మాఫియాని ఎదురొడ్డి పోరాడే నిపుణత్వం అతడికి ఉందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.