Begin typing your search above and press return to search.

ముంబైలో ల్యాండ్ అయిన హాట్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   23 July 2018 2:30 PM GMT
ముంబైలో ల్యాండ్ అయిన హాట్ బ్యూటీ!
X
`ఆషిక్ బ‌నాయా....ఆషిక్ బ‌నాయా....ఆషిక్ బ‌నాయా ఆప్ నే.....`...స‌రిగ్గా 13 ఏళ్ల క్రితం విడుద‌లైన ఈ పాట...ఇప్ప‌టికీ యువ‌త‌ను ఉర్రూత‌లూగిస్తోంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఆ పాట‌లో బాలీవుడ్ సీరియ‌ల్ కిస్స‌ర్ ఇమ్రాన్ హ‌ష్మీతో క‌లిసి ఘాటుగా అందాలు ఆర‌బోసిన త‌నూ శ్రీ ద‌త్తా....కుర్ర‌కారు మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసింది. హాట్ గ‌ర్ల్ గా ప‌లు చిత్రాల్లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ గ‌త ఎనిమిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా నేడు ముంబై ఎయిర్ పోర్టులో ఈ అందాల భామ త‌ళుక్కున మెరిసింది. అయితే, రెండేళ్ల క్రితం అమెరికా చెక్కేసిన త‌ను శ్రీ ద‌త్తా హ‌ఠాత్తుగా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేస‌రికి ఆమెను గుర్తు ప‌ట్ట‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత త‌నూను ఫొటోగ్రాఫ‌ర్లు తమ కెమెరాల్లో బంధించారు. విమానంతో తాను దిగిన ఫొటోల‌ను త‌నూ ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ హాట్ బ్యూటీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

బ్లూ టాప్‌ - బ్లాక్ లెగ్గింగ్ లో ముద్దుగా ...బొద్దుగా వ‌స్తోన్న త‌నూను ఫొటోగ్రాఫ‌ర్లు గుర్తుప‌ట్ట‌లేదు. రెండేళ్ల క్రితం త‌నూకు ఇప్పుడు చూస్తున్న త‌నూకు చాలా వ్య‌త్యాసం ఉంది. ఆ త‌ర్వాత త‌నూ...విక్టరి సింబల్ చూసిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అంత‌కుముందు, విమానంలో తీసిన ఫోటోలను తన ఇన్‌ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రెండేళ్ల విరామం తర్వాత ముంబై వస్తున్నానని, చాలా సంతోషంగా....మరికాస్తా ఆందోళనగా ఉందంటూ పోస్ట్ చేసింది. 2003లో ‘మిస్‌ ఇండియా’గా ఎంపికైన‌ తనుశ్రీ ద‌త్తా.... ‘ఆషిక్ బనాయా ఆప్ నే’తో తెరంగేట్రం చేసింది. ఆ ఒక్క‌పాట‌తో పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత ‘చాకోలేట్‌’ - ‘రఖీబ్‌’ - ‘ధోల్‌’ - ‘రిస్క్‌’ -‘గుడ్‌ బాయ్‌ - బ్యాడ్‌ బాయ్‌’ వంటి ప‌లు చిత్రాల్లో న‌టించింది. తెలుగులో బాల‌కృష్ణ‌తో క‌లిసి ‘వీరభద్ర’ సినిమాలో న‌టించింది. 2010లో ‘అపార్ట్‌ మెంట్‌’ లో న‌టించిన త‌నూశ్రీ ...ఆ త‌ర్వాత మ‌రే సినిమాలో న‌టించ‌లేదు. రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిపోయిన త‌నూ...ఈ రోజు ముంబైలో ప్ర‌త్య‌క్ష‌మైంది. `ఆషిక్ బనాయా ఆప్ నే` సీక్వెల్ లో త‌నూ శ్రీ న‌టించాల‌ని ఆమె అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మ‌రి, ఆ కోరిక‌ను మ‌న్నించి మ‌ళ్లీ తెర‌పై మెరుస్తుందో లేదో వేచి చూడాలి.